China Balloon : క్షమాపణ చెప్పం... జిన్ పింగ్ తో మాట్లాడతాం

China Balloon : క్షమాపణ చెప్పం... జిన్ పింగ్ తో మాట్లాడతాం
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మాట్లాడాలని తెలిపారు. రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ జరగకూడదని అన్నారు

చైనా బెలూన్ ను కూల్చివేసినందుకు క్షమాపణలు చెప్పేది లేదని అన్నారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్. ఈ విషయంపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మాట్లాడాలని తెలిపారు. రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ జరగకూడదని అన్నారు. ఫిబ్రవరి 4న దక్షిణ కరోలినా తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో చైనా గూఢచర్య బెలూన్ ను అమెరికా ఫైటర్ జెట్ లు కూల్చివేశాయి. మరో మూడు అనుమానాస్పదంగా ఎగురుతున్న వస్తువులను కూడా అమెరికా కూల్చివేసింది.

ఫిబ్రవరి 11న అలాస్కా మీదుగా ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువును అమెరికా ఫైటర్ జెట్ కూల్చేసింది. ఒక రోజు తర్వాత యూఎస్ F-22 ఫైటర్ జెట్ కెనడా మీదుగా ఎగురుతున్న స్థూపాకార వస్తువును కూల్చివేసింది. ఫిబ్రవరి 13న హురాన్ సరస్సుపై ఒక అష్టభుజి వస్తువును కూల్చివేసినట్లు అమెరికా వర్గాలు ప్రకటించాయి.
అమెరికా గగన తలంలో అనుమానాస్పదంగా ఎగిరిన వస్తువులు చైనావి కావని, కేవలం బెలున్ మాత్రమే చైనా కు చెందినదని స్పష్టం చేశారు జో బైడెన్. శిధిలాలను వెతికే పనిలో పడ్డారు. గూడచర్యం చేసే వైమానిక వస్తువలపై మరింత జాగ్రత్తగా ఉండటానికి, ట్రాక్ చేయడానికి మెరుగైన టెక్నాలజీని వాడాలని జోబైడెన్ అధికారులను ఆదేశించారు.

బైడెన్ వాఖ్యలపై చైనావిదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధిని మీడియాతో మాట్లాడుతూ... అమెరికా తమ బెలూన్ ను కూల్చి తప్పుచేసిందని అన్నారు. వివాదాలను నివారించేందుకు అమెరికా సిద్ధంగా ఉండాలని వాంగ్ వెన్భిన్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story