అంతర్జాతీయం

చైనా నుంచి వ్యాక్సిన్ వచ్చేసింది.. చాలా సేఫ్ కూడా: బ్రెజిల్ కాంప్లిమెంట్

దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థ సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 'కరోనా వ్యాక్‌'పై బ్రెజిల్‌లోని

చైనా నుంచి వ్యాక్సిన్ వచ్చేసింది.. చాలా సేఫ్ కూడా: బ్రెజిల్ కాంప్లిమెంట్
X

ఎవరు అవునన్నా కాదన్నా చైనాతో మన చెలిమికి చెక్ పెట్టడం సాధ్యం కాదేమో.. పొద్దున్నలేస్తే వాడే వస్తువులన్నీ వారివే.. ఆ నాలుగు రోజులు ఆగ్రహజ్వాలలు వ్యక్తమైనా ఆ తరువాత చైనా రిలీజ్ చేసే ప్రోడక్టులపైనే అందరి కళ్లు.. అంతగా ఆకర్షిస్తాయి చైనా గూడ్స్. కరోనాని పంపించిందని కారాలు మిరియాలు నూరిన అగ్ర రాజ్య అధ్యక్షుడికి అవునని ఒక్కరూ సపోర్ట్ చేయకపోవడం గమనించదగిన విషయం. కరోనాని కనిపెట్టిన వెంటనే వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది చైనా..

దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థ సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 'కరోనా వ్యాక్‌'పై బ్రెజిల్‌లోని ప్రముఖ బయోమెడికల్ పరిశోధనా కేంద్రం పావో పాలో బుటాంటన్ ఇనిస్టిట్యూట్ క్లినికల్ ట్రయల్స్ చేస్తోంది. ఈ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 9 వేల మంది వాలంటీర్లకు ఈ టీకాను ఇచ్చారు. తుది దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని పావో పాలో బుటాంటన్ ఇనిస్టిట్యూట్ ఒక ప్రకటన పేర్కొంది.

బ్రెజిల్‌లో చివరి దశకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలను సోమవారం (అక్టోబర్ 19) వెల్లడించారు. టీకా ప్రయోగాలు చివరి దశకు చేరుకున్న తొలి వ్యాక్సిన్ తయారీ సంస్థగా సినోవాక్ నిలిచింది. ఈ ఏడాది చివరికల్లా అన్ని అనుమతులను పొంది, 2021 ప్రారంభం నుంచి ప్రజలందరికీ టీకీ ఇవ్వాలని భావిస్తున్నారు. ట్రయల్స్‌లో మొత్తం 15 వేల మంది వాలంటీర్లను పాల్గొంటున్నారని.. వారందరిపై ప్రయోగాలు పూర్తయిన తర్వాత వ్యాక్సిన్ సమర్ధతకు సంబధించిన వివరాలను వెల్లడిస్తామని బుటాంటన్ డైరెక్టర్ పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES