భూగర్భంలోకి 10వేల మీటర్ల లోతులో చైనా తవ్వకం

భూగర్భంలోకి 10వేల మీటర్ల లోతులో చైనా తవ్వకం
భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వకాన్ని మొదలు పెట్టింది చైనా. దీంతో చైనా భూగర్భాన్వేషణలో మరో ముందడుగు పడినట్లైంది

భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వకాన్ని మొదలు పెట్టింది చైనా. దీంతో చైనా భూగర్భాన్వేషణలో మరో ముందడుగు పడినట్లైంది. ఈ రంధ్రం సుమారు 10వేల మీటర్ల లోతు ఉండొచ్చని అంచనా. చైనాలోని షింజియాంగ్‌ ప్రాంతంలో ఈ తవ్వకాన్ని మొదలుపెట్టారు. చైనా తవ్వుతున్న అత్యంత లోతైన రంధ్రంగా ఇది నిలవనుంది. భూమి అడుగున దాదాపు 10 రాతి పొరలను చీల్చుకొంటూ తవ్వకాలు సాగనున్నాయి. ఇది దాదాపు 145 మిలియన్‌ సంవత్సరాల వయస్సున్న క్రెటెషియస్‌ పొరను చేరుకోనుంది.

ఖనిజ సంపద, ఇంధన వనరులను గుర్తించడంతోపాటు.. భూకంపాలు, అగ్నిపర్వతాల ముప్పును ముందే పసిగట్టేందుకు ఈ తవ్వకాలు చేస్తున్నట్లు తెలిపారు. డ్రిల్లింగ్‌ ప్రాజెక్టు అత్యంత కఠినమైంది. ఓ భారీ ట్రక్కును రెండు సన్నటి తీగలపై నడిపించినట్లు ఉంటుందని వెల్లడించారు చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే మానవులు తవ్విన అత్యంత లోతైన రంధ్రం రష్యాలో ఉంది. కోలా సూపర్‌ డీప్‌ బోర్‌హోల్‌గా దీనిని వ్యవహరిస్తారు. ఇది 12,262 మీటర్లు ఉంది. 20 ఏళ్లపాటు బోర్‌ వేయగా 1989లో ఈ లోతుకు అది చేరుకుంది.

Tags

Read MoreRead Less
Next Story