China Earthquake: చైనాలో భారీ భూకంపం, ఢిల్లీ వరకూ ప్రకంపనలు,

ణ చైనా లోని జిన్‌జియాంగ్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతోభూకంపం సంభవించింది. భూఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ ఎక్స్ వేదికగా ప్రకటించింది. చైనా కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తరువాత 2:09 నిమిషాలకు చైనా దక్షిణ ప్రాంతంలోని గ్ఝిన్‌జియాంగ్ రీజియన్‌లో భూకంపం సంభవించింది. అక్సు ప్రీఫెక్షర్ రీజియన్ వుషి కంట్రీలో భూమి ప్రకంపించినటలు చైనా భూకంపాల నెట్‌వర్క్ సెంటర్ తెలిపింది. కిర్గిజిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది గ్ఝిన్ జియాంగ్ రీజియన్. ఉపరితలం నుంచి 80 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లో చోటు చేసుకున్న పెను కదలికలతో జరిగిన ఈ ఘటన తీవ్రతకు వుషి కంట్రీలో కొన్ని భవనాలు బీటలు వారినట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
భూమి ప్రకంపించిన వెంటనే స్థానికులు భయంతో రోడ్ల మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాతా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు కావడంతో ఇళ్లల్లోనికి వెళ్లడానికి భయపడ్డారు. గడ్డ కట్టించే చలిలో రోడ్ల మీదే జాగారం చేశారు. . తెల్లవారుజామున 2 గంటల 9 నిమిషాలకు అత్యధికంగా 7.1 తీవ్రత నమోదు కాగా ఆ తరువాత 4 గంటల వరకూ సుమారు 14 సార్లు కంపించింది. ఈ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. ట్రాక్‌లు దెబ్బతినడంతో చాలా రైళ్లు రద్దయ్యాయి. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవల విభాగాన్ని ప్రభుత్వ యంత్రాంగం యాక్టివేట్ చేసింది. సహాయక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అటు పొరుగు దేశం కజికిస్థాన్లోని ఆల్మటీలో 6.7 తీవ్రత నమోదైంది. దాంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. చైనాలో గడిచిన 24 గంటల్లో అనేకమార్లు భూమి కంపించడం ఆందోళనకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రకంపనలతో జిన్జియాంగ్ ప్రాంతం దద్దరిల్లిపోయింది. సరిహద్దు దేశం కజగిస్థాన్లోని అతిపెద్ద నగరమైన ఆల్మటీలో 6.7 తీవ్రతో భూమి కంపించింది. తీవ్రమైన చలిలోనూ ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ తీవ్ర భూకంపం ధాటికి దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ భూప్రకంపనలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. గత రాత్రి 11.39 గంటల సమయంలో భూప్రకంపనలు నమోదయినట్టు వెల్లడించింది. ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో భూమి కంపించింది. ఘజియాబాద్, గ్రేటర్ నొయిడా, గుర్‌గావ్.. వంటి నగరాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
జనవరి 11న ఆఫ్ఘనిస్థాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిన సమయంలో కూడా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు ఈశాన్య దిశలో 241 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో పాకిస్థాన్‌లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com