China: అత్యంత శక్తివంతమైన అణు క్షిపణుల ప్రదర్శన చేసిన చైనా

China: అత్యంత శక్తివంతమైన అణు క్షిపణుల ప్రదర్శన చేసిన చైనా
X
జపాన్‌పై వేసిన అణు బాంబుల కంటే 200 రెట్లు శక్తివంతమైనవి ప్రదర్శన

చైనా బుధవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. బీజింగ్ వేదికగా అత్యంత పవర్‌ఫుల్ క్షిపణులను ప్రదర్శించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించిన గుర్తుగా 80వ వార్షికోత్సవాన్ని చైనా నిర్వహించింది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. పెద్ద ఎత్తున ఆయుధాల ప్రదర్శన జరిగినప్పుడు నేతలంతా ఆద్యంత ఆసక్తిగా వీక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

అయితే జపాన్‌పై గతంలో వేసిన అణు బాంబుల కంటే 200 రెట్లు శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. DF-5C వంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు చూపించింది. హైపర్సోనిక్ క్షిపణులు, లేజర్ ఆయుధాలు, నీటి అడుగున వెళ్లే డ్రోన్లు అబ్బురపరిచాయి. పుతిన్-జిన్‌పింగ్-కిమ్ ముగ్గురూ పక్కపక్కనే నిలబడి వీక్షించారు. ఈ ప్రదర్శనతో చైనాను ఆపలేమంటూ నేతలు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తాజా అణు క్షిపణులే 20,000 కి.మీ లక్ష్యాలను కూడా ఛేదించగలవని ఒక సైనిక నిపుణుడు పేర్కొన్నట్లు చైనీస్ దినపత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

ఇదిలా ఉంటే పుతిన్, జిన్‌పింగ్, కిమ్.. అమెరికాపై కుట్ర పన్నుతున్నారంటూ ట్రంప్ ఆరోపించారు. చైనా సైనిక కవాతు సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా పక్షాన అమెరికా సైనికులు కూడా రక్తాన్ని చిందించారని.. ఈ సందర్భగా చైనా అధ్యక్షుడు గుర్తు చేసుకోవాలని ట్రంప్ హితవు పలికారు.

Tags

Next Story