China :తైవాన్, చైనా మధ్య యుద్ధ మేఘాలు

China :తైవాన్, చైనా మధ్య యుద్ధ మేఘాలు
తైవాన్‌ దిశగా చైనా నౌకలు, యుద్ధ విమానాలు

చైనా, తైవాన్‌ల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాన్‌గాంగ్‌ వార్షిక సైనిక విన్యాసాలకు తైవాన్‌ సన్నద్ధమవుతున్న వేళ డ్రాగన్‌ బెదిరిపులు మొదలుపెట్టింది. నిన్నటి నుంచి తైవాన్‌ సరిహద్దులకు, విమానాలను, యుద్ధనౌకలు పంపుతోంది. ఇప్పటికే 68 ఫైటర్‌ జెట్లు తైవాన్‌ జలసంధి మధ్య రేఖను దాటినట్లు తైవాన్‌ రక్షణ శాఖ ఆరోపించింది.

తైవాన్‌ను భయపెట్టేందుకు చైనా ప్రయత్నాలను తీవ్రం చేసింది. తాజాగా భారీ సంఖ్యలో యుద్ధనౌకలు, ఫైటర్‌జెట్‌, ఇతర విమానాలను తైవాన్‌ దిశగా పంపింది. ఈ విషయాన్ని తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ-PLA మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఏకంగా 38 విమానాలు, 9నౌకలు తైవాన్‌ దిశగా వచ్చాయని తెలిపింది. బుధవారం ఉదయం నుంచి దాదాపు 30 యుద్ధ విమానాలు వచ్చినట్లు తైవాన్‌ రక్షణ శాఖ ప్రకటించింది. అందులో జే-10, జే-16 రకం ఫైటర్లు ఉన్నాయి. చైనాకు చెందిన హెచ్‌-6 భారీ బాంబర్లు కూడా తైవాన్‌ సమీపంలో ఎగిరినట్లు సమాచారం. అందులో 32 విమానాలు తైవాన్‌ జలసంధిలోని మధ్యరేఖను దాటినట్లు తైవాన్‌ రక్షణ శాఖ తెలిపింది. ఈ లైన్‌ను ఇరుదేశాల మధ్య అనధికారిక సరిహద్దుగా భావిస్తారు.


బుధవారం మధ్యాహ్నం తర్వాత మరో 23 విమానాలు వచ్చినట్లు తైవాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. తైవాన్‌ నిర్వహించే హాన్‌గాంగ్‌ సైనిక విన్యాసాల ముందు చైనా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఏప్రిల్‌లో కూడా తైవాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో డ్రాగన్‌ భారీగా యుద్ధనౌకలు, డజన్లకొద్దీ ఫైటర్‌ జెట్లను మోహరించింది. యుద్ధానికి రిహార్సల్‌గా పేర్కొంది. అప్పట్లో షిప్పింగ్‌, ఎయిర్‌లైన్స్‌ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ మెక్‌కార్థీతో తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌వెన్‌ సమావేశం కావటంతోప్రతీకారచర్యగా తైవాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో 8యుద్ధ నౌకలతోపాటు42ఫైటర్‌ జెట్‌ విమానాలను చైనా మోహరించింది.

Tags

Read MoreRead Less
Next Story