China: చైనావాడు పువ్వులను కూడా వదల్లేదుగా..!

China (tv5news.in)
China: ఆసియాలో ఉన్న అన్ని దేశాల్లో కామర్స్‌లో దూసుకుపోయే దేశం ఏదంటే డౌట్ లేకుండా చైనా అని చెప్పేస్తారు చాలామంది. కోవిడ్ తర్వాత చైనా కామర్స్‌లో కాస్త వెనకబడినా కూడా.. మళ్లీ వెంటనే ఎలా కవర్ అవ్వాలో అక్కడి వ్యాపారవేత్తలకు బాగా తెలుసు. అందుకే అందరినీ దాటి ఓ బిజినెస్‌లో ఏకంగా రూ. 180 కోట్ల ఆదాయాన్ని రాబడుతుందట చైనా. ఇంతకీ ఏంటా బిజినెస్..?
చైనా దేశం దాదాపు అన్ని వ్యాపారాలలో తన సత్తా చాటుకుంది. కానీ అన్నింటికి మించి చైనా దగ్గర ఆసియాలో ఏ దేశంలో లేనంత పెద్ద పూల మార్కెట్ ఉంది. పూలను నేరుగా ఆ మార్కెట్‌లో విక్రయించడమే కాకుండా ఈ కామర్స్ ద్వారా కూడా ఆ పూలకు డిమాండ్ వచ్చేలా చేస్తున్నారు అక్కడి వ్యాపారులు. అందుకే కొన్నిరోజులుగా వెనకబడిన చైనా బిజినెస్ మళ్లీ పుంజుకుంది.
చైనాలో పూల వ్యాపారం వల్ల 160 బిలియన్ యువాన్లు అంటే రూ. 180 కోట్లు ఆదాయం పొందుతోంది. అందులో ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారా విక్రయించినవే. ఆన్‌లైన్‌లో పూల బొకేలు, దండలు కొంటున్నవారికి అధికంగా డిస్కౌంట్స్, ఆఫర్స్ పెడుతూ అందరినీ ఆకర్షిస్తున్నాయి అక్కడి కంపెనీలు. ఆన్‌లైన్‌లో అయిదు బొకేలు కేవలం 39.8 యువాన్లు (రూ.468)కే అందించడంతో కొనుగోలుదారులు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు.
వాలెంటైన్స్ డే లాంటివి ఉన్నప్పుడు పూల వ్యాపారానికి మరింత డిమాండ్ పెరుగుతుంది. అన్ని దేశాలకంటే చైనాలో మరింత పెరుగుతుంది. మామూలుగా ప్రతీరోజు నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ పువ్వులను అమ్మే చైనా ఒక్క వాలెంటైన్స్ డే రోజునే 9.3 మిలియన్ల వ్యూలు విక్రయిస్తుందని వ్యాపార నిపుణులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com