First Bullet Train : అరుణాచల్ సమీపంలో చైనా బుల్లెట్ ట్రైన్..!

First Bullet Train : టిబెట్‌లో మొట్టమొదటి బుల్లెట్ రైల్వే లైన్‌ను ప్రారంభించింది చైనా. టిబెట్ రాజధాని లాసా నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో ఉన్న నింగ్చీ వరకు 435.5 కిలో మీటర్ల మేర ఈ రైల్వేలైనును ఏర్పాటు చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డ్రాగన్ దేశం ఈ బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఇంకా సమసిపోక మునుపే చైనా ఇలాంటి చర్యలకు దిగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్‌కు అత్యంత సమీపంలోకి బుల్లెట్ ట్రైన్ ప్రారంభించడం చైనా వ్యూహాత్మక అడుగని అంటున్నారు.
ఇది టిబెట్‌లో రెండవ రైల్వే లైన్. ఇప్పటికే క్వింఘాయ్-టిబెట్ రైల్వే మార్గం అందుబాటులో ఉంది. ఈ బుల్లెట్ రైలు కోసం లాసా, నింగ్చీ మధ్య 2014లోనే పనులు ప్రారంభించారు. టిబెట్‌లో పూర్తి స్థాయి విద్యుదీకరించిన మొట్టమొదటి రైల్వే లైన్ ఇదే కావడం విశేషం. సరిహద్దులో భద్రతను పరిరక్షించడంతో ఈ కొత్త రైలు మార్గం కీలక పాత్ర పోషిస్తుందని.. కనుక దీన్ని తర్వగా పూర్తి చేయాలని నవంబర్‌లో అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ రైలు మార్గం నిర్మాణంతో చెంగ్డూ నుంచి లాసాకు ప్రయాణ సమయం 48 గంటల నుంచి 13 గంటలకు తగ్గబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com