చైనావాళ్లకిదేం రోగం..వాళ్ల వ్యాక్సినే వేసుకోవాలట..!

చైనావాళ్లకిదేం రోగం..వాళ్ల వ్యాక్సినే వేసుకోవాలట..!
ఈ రకంగానైనా చైనా తన సినోవ్యాక్స్ వ్యాక్సిన్ అమ్మకాలను పెంచుకోవాలనుకుంటుందేమో మరి..!

కరోనా పుట్టిందే చైనాలో, అది ఎలాగన్నది తర్వాత సంగతి, ముందు కోవిడ్19 వైరస్‌కి పుట్టిల్లు మాత్రం డ్రాగన్ కంట్రీనే. ప్రపంచదేశాల ముందు చైనా ఏకాకి అయినా, దోషిగా నిల్చున్నా ఈ ఒక్క అంశంలోనే అసలు చరిత్ర గతినే మార్చింది వైరస్, ప్రపంచ దేశాలు తలుపులు మూసుకుని మాస్క్‌లేసుకుని గడిపిన క్షణాలు ఎవరు మరవగలరు.? ఐతే ఎంత పెద్ద ఉత్పాతమైనా సరే, కాలగమనంలో కలిసిపోతుంది జీవితం

ముందుకు సాగుతుంది. అలానే ఇప్పుడు కరోనా వైరస్‌కి టీకాలు కనుక్కుని కాస్త ఊపిరి పీల్చుకుంటుంటే, చైనా మరో పితలాటకానికి తెర తీసింది. తమ దేశంలో ప్రవేశించే భారతీయులు చైనా వ్యాక్సిన్‌నే వాడాలట ఒక్క భారతీయులనే కాదు, ఏ దేశం వారైనా సరే తమ దేశంలో కాలు పెట్టాలంటే చైనా మేడ్ వ్యాక్సిన్‌నే వేయించుకోవాలంటూ అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు నోటీసులు పంపింది

ఇదెలాగుందంటే, ఇక్కడే వైరస్ పుట్టింది కాబట్టి..మీ దేశాల్లోని స్ట్రెయిన్‌తో మాకు సంబంధం లేదు..మా వైరస్ మాదే, మా వ్యాక్సిన్ మాదే అన్నట్లుగా ఉంది చైనా ధోరణి. వాస్తవానికి కరోనాపై పోరాటంలో ప్రపంచానికే విశ్వగురువుగా నిలిచింది భారత్. లేకపోతే 130 కోట్లమంది ఉన్న ఇరుకుదేశంలో కేవలం కోటిమందికే వైరస్ బయటపడటం ఏంటి. ఇది మన ఇమ్యూనిటీ కావచ్చు ఇంకోటి కావచ్చు. అలానే వైరస్‌కి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడంలోనూ, సొంతంగా తయారు చేయడంలోనూ భారత సంస్థల ఘనత ఎవరూ తక్కువ చేసి చూడలేరు.

అలాంటి సమయంలో చైనా వ్యాక్సిన్లను వాడమన్నా ఏ దేశాలూ ప్రత్యేకించి అగ్రరాజ్యాలు అసలే పట్టించుకోవడం లేదు. ఎక్కడో లాటిన్ అమెరికా దేశాలకు మాత్రం ముందే ఆర్ధికసాయం పేరుతో వ్యాక్సిన్లను అంటగట్టింది కానీ చైనా వ్యాక్సిన్లు..చైనా బజార్ ఉత్పత్తుల్లానే పని చేస్తాయేమో అనే జోకులకూ తక్కువ లేదు. ఆ దేశపు విజ్ఞానాన్ని ఎవరూ తక్కువ చేయడం లేదు కానీ, ఇలా తమ దేశంలో ప్రవేశించేవారికి తమ దేశపు టీకాలే వేయించుకోవాలనుకోవడం దురహంకారం.

కరోనా వ్యాక్సిన్ బిజినెస్ కొన్ని వేల కోట్లరూపాయల విలువ ఉండటంతో ముందుగానే రష్యా , బ్రిటన్ దేశాలు వ్యాక్సిన్లు తయారు చేయగా, అమెరికా కూడా ముందంజలోనే ఉంది. ఐతే ఇప్పుడు ఆస్ట్రాజెనెకా, నోవావేక్స్ జాన్సన్ అండ్ జాన్సన్ ‌కి ధీటుగా భారత్ బయోటెక్, జైకోవిడ్ వంటి మన దేశీయ టీకాలు రంగంలోకి వస్తున్నాయ్. ఈ క్రమంలో చైనా వ్యాక్సిన్ల గురించి మాట్లాడుకునేవాళ్లే తక్కువైపోయారు. అందుకే చైనా ఇలా చేస్తుందా అనే అనుమానం కూడా ఉంది.

ఎయిర్ పోర్టులలోనే ఏ వ్యాక్సిన్ పడకపోతే, మా వ్యాక్సిన్ వేస్తాం అనడం ఓ పద్దతి, అంతేకానీ, ఇలా మా దేశపు వ్యాక్సిన్లే వేస్తాం అనడం చైనా పట్ల మరోసారి ప్రపంచదేశాల్లో ఏవగింపు కలిగించే చర్యే ! చైనాకి వెళ్లే ప్రతి ఒక్క ఇతర దేశస్థులు ఎలక్ట్రానిక్ హెల్త్ డిక్లరేషన్ డిపార్ట్ మెంట్ దగ్గర హాజరు కావాలంటూ మార్చి 15 నుంచి ఆ దేశం అన్ని కంట్రీల ఎంబసీలకు ఆదేశాలు పంపింది. ఇంతేకాదు వాళ్ల వ్యాక్సిన్ వేయించుకునేవాళ్లకి వీసా రిస్ట్రిక్షన్లలో సడలింపు ఉంటుందంటూ కూడా తాయిలం ఇవ్వజూపడం మరో విడ్డూరం. ఈరకంగానైనా చైనా తన సినోవ్యాక్స్ వ్యాక్సిన్ అమ్మకాలను పెంచుకోవాలనుకుంటుందేమో మరి..!

Also Read : Profit Your Trade

Tags

Read MoreRead Less
Next Story