China: గంటకు 600కి.మీ వేగం- నిమిషానికి 8కి.మీల దూరం- విమానం కాదు రైలే

China: గంటకు 600కి.మీ వేగం- నిమిషానికి 8కి.మీల దూరం- విమానం కాదు రైలే
X
పూర్తి వివరాలు ఇవే

తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎవరైనా విమానాన్నే ఎంచుకుంటారు. కానీ ఇటీవల విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతూ అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. దీంతో ఆలస్యమైనా సరే రైలు ప్రయాణమే ఉత్తమమని చాలామంది భావిస్తున్నారు. కానీ రైలులోనే విమానమంత వేగంగా ప్రయాణించే అవకాశం లభిస్తే! చైనా ఆ కలను సాకారం చేసి చూపించింది. గంటకు 600 కిలోమీటర్లు ప్రయాణించే రైలును ఆవిష్కరించింది. మ్యాగ్నెటిక్‌ లెవిటేషన్‌ (మాగ్లెవ్‌) సాంకేతికతతో రూపొందించిన రైలును ఇటీవల పరీక్షించింది.

ఈ రైలు 150 నిమిషాల్లో 1,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. కొన్ని రకాల విమానాల వేగం కన్నా ఈ రైలు అత్యధిక వేగాన్ని నమోదుచేసింది. ఇటీవల నిర్వహించిన 17వ మాడర్న్‌ రైల్వేస్‌ ఎగ్జిబిషన్‌లో ఈ రైలును ఆవిష్కరించారు.

ఈ రైలు కేవలం ఏడు సెకన్ల వ్యవధిలో 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంటే బీజింగ్‌, షాంఘై మధ్యనున్న 1,200 కిలోమీటర్ల దూరాన్ని ఈ మాగ్లెవ్‌ రైలు కేవలం రెండున్నర గంటల్లో (150 నిమిషాలు) అందుకుంటుందని దానిని రూపొందించిన చైనా రైల్వే రోలింగ్‌ స్టాక్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు తెలిపారు. విమానాలు గంటకు 547 మైళ్ల వేగంతో వెళ్తే.. ఈ రైలును 2023లో పరీక్షించినప్పుడు 620 మైళ్ల వేగాన్ని అందుకున్నదని పేర్కొన్నారు.

Tags

Next Story