China population : చైనా జనాభా తగ్గుతోంది..

China population : చైనా జనాభా తగ్గుతోంది..
గత 60 ఏళ్లలో ఇదే మొదటిసారి



చైనాలో జనాభా రేటు తగ్గింది. గత 60 ఏళ్లలో సంతానోత్పత్తి కంటే మరణాలు ఎక్కువగా నమోయ్యాయి. చైనా 'నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్' మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా, మొదటిసారి సంతానోత్పత్తి రేటులో క్షిణించింది. 2022 సంవత్సరానికిగాను చైనాలో 8లక్షల 50వేల జనాభా తగ్గింది. 2021లో జననాలు 13% శాతం, 2020లో 22% శాతం జననాలు తగ్గాయని 'నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్' డేటా తెలిపింది. డిసెంబర్ 2022 - జనవరి 2023 మధ్య చైనా హాస్పిటల్స్ లో సుమారు 60వేల మంది కోవిడ్ కారణంగా మరణించారని అధికారులు వెల్లడించారు.

చైనాలో తగ్గుతున్న జనాభా ఆ దేశ సంక్షోభానికి దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరు దశాబ్దాలలో మొదటిసారి.. సంతానోత్పత్తి కంటే మరణాల రేటు ఎక్కువగా ఉందని 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. ఇదిలాగే ఉంటే చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేయనుంది.

'నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్' డేటా ప్రకారం... 2022లో చైనాలో 95 లక్షల 60వేల మంది జన్మించగా, కోటి 41వేల మంది మరణించారు. 1960 నుండి చైనాలో జననాల కంటే మరణాలు ఎక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో చైనాలో కార్మికశక్తి తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జనాభాను పెంచేందుకు చైనా చర్యలు చేపట్టింది. 35 సంవత్సరాలుగా అమలులో ఉన్న 'ఒక బిడ్డ' విధానానికి స్వస్తి పలికింది. ఈ పరిమితిని మూడుకు పెంచింది. సంతానోత్పత్తికోసం పలు రకాలప్రోత్సాహకాలను అందించింది చైనా. అందులో పన్ను తగ్గింపులు, ఆస్తి పన్ను రాయితీలు కూడా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story