CHINA: చైనా విదేశాంగమంత్రిపై వేటు.. వివాహేతర సంబంధమే కారణమా..
అనుకున్నదే జరిగింది. అజ్ఞాతంలో ఉన్న మరో మంత్రిపై చైనా ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. నెలరోజులుగా కనిపించకుండా పోయిన చైనా(China) విదేశాంగ మంత్రి(China's Foreign Minister) కిన్‌గాంగ్(Qin Gang)ను జిన్‌పింగ్ ప్రభుత్వం(Qin's removal) తొలగించింది. ఆయన డ్రాగన్ విదేశాంగమంత్రి(New foreign minister)గా వాంగ్ యీ( Wang Yi )ని నియమించింది. కొత్త విదేశాంగ మంత్రి నియామకానికి జిన్‌పింగ్ ఆమోదముద్ర(President Xi Jinping signed) వేశారు. అయితే చిన్‌గాంగ్‌ను ఎందుకు తొలగించారో(Qin Gang was removed from the post of foreign minister) చైనా ప్రభుత్వం వెల్లడించలేదు. కిన్‌గాంగ్ నాలుగు వారాలుగా కనిపించకపోవడం(lipped for weeks)తో ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆచూకీపై ఆసక్తి నెలకొంది. ఇది కొనసాగుతుండగానే ఆయనపై జిన్‌పింగ్ సర్కార్ వేటు వేసింది.
కిన్‌కాంగ్ తొలగించేందుకు ఆయన అనారోగ్యమే కారణమని పైకి చెబుతున్నా అమెరికా పౌరసత్వమున్న చైనా జర్నలిస్టుతో వివాహేతర సంబంధమే ఆయన మాయమవటానికి కారణమని కొందరు చెబుతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కిన్‌గాంగ్ అత్యంత సన్నిహితుడు. ఆయన అండతోనే ఇటీవలి కాలంలో చైనా విదేశాంగ విధానంలో అత్యంత బలీయమైన నేతగా ఎదిగారు. చైనా వాదనను అంతర్జాతీయ వేదికపై బలంగా వినిపించారు.
కిన్‌గాంగ్(Qin Gang) 1988లో చైనా విదేశాంగశాఖలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. రెండుదఫాలు చైనా విదేశాంగ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. జిన్‌పింగ్ అధ్యక్షుడయ్యాక కీలక స్థానాల్లో(diplomatic ranks to their relationship)కి ఎదిగారు. 2021లో స్వల్పకాలంపాటు అమెరికా రాయబారిగా నియమితుడై 2022లో అనేకమంది సీనియర్లను కాదని విదేశాంగశాఖ మంత్రిగా పదోన్నతి పొందారు. పాశ్చాత్య దేశాల్లో చైనా పట్ల ఉన్న వ్యతిరేకతను బలంగా తిప్పికొట్టిన నేతగా కిన్‌గాంగ్‌కు పేరుంది. ఎదురుదాడిలో దిట్టగా మంచి పేరుంది.
జూన్ 25న చివరిసారిగా రష్యా ఉప విదేశాంగమంత్రి ఆండ్రీ రుడెంకోతో భేటీలో ఆయన కనిపించారు. ఆ తర్వాత అనేక కీలక సమావేశాలు ఆయన లేకుండానే సాగిపోతున్నాయి. లేదా వాయిదా పడుతున్నాయి. ఆసియాన్ కూటమి సమావేశం ఆయన లేకుండానే ముగిసింది. యూకే విదేశాంగ మంత్రి బీజింగ్ పర్యటన, యూరోపియన్ యూనియన్ అధికారుల పర్యటన వాయిదా పడ్డాయి. అమెరికా ఆర్థిక మంత్రి, పర్యావరణ మంత్రుల బీజింగ్ పర్యటనలు చిన్‌గాంగ్ లేకుండానే ముగిశాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com