China : చైనా లో మరో భయంకరమైన వైరస్..!

China : చైనా లో మరో భయంకరమైన వైరస్..!
X
China : చైనాలో ఇప్పుడు మరో భయంకరమైన కేసు ఒకటి వెలుగు చూసింది. దేశంలోని జియాంగ్సు ప్రావిన్స్ లో ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ బారిన పడ్డాడు.

China : చైనాలో ఇప్పుడు మరో భయంకరమైన కేసు ఒకటి వెలుగు చూసింది. దేశంలోని జియాంగ్సు ప్రావిన్స్ లో ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ బారిన పడ్డాడు. మానవులకు సంక్రమించే బర్డ్ ఫ్లూ.. కేసు నమోదు కావటం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.. బర్డ్ ఫ్లూ బారిన పడిన వ్యక్తులు H10N3 ఎవియన్ ఇన్ ప్లూయెంజా లక్షణాలను గుర్తించారు వైద్యులు.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డిశ్చార్జ్ కి సిద్ధంగా ఉన్నాడని వివరించారు. మరోవైపు బర్డ్ ఫ్లూ ఎలా వ్యాప్తిచెందిందో తెలియదని అంటున్నారు చైనా వైద్యాధికారులు. పౌల్ట్రీ నుంచి మనుషులకు ఈ వ్యాధి వ్యాపించడం పై ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్ మహమ్మారిగా మారే అవకాశాలు చాలా స్వల్పం అంటున్నారు వైద్యులు.


Tags

Next Story