చైనా వ్యాక్సిన్‌ను నమ్మని ప్రపంచదేశాలు

ప్రపంచానికి కరోనా వైరస్‌ను అంటించిన చైనా తయారు చేస్తోన్న వ్యాక్సిన్‌పై ప్రపంచదేశాలకు నమ్మకం లేకుండాపోయింది. వ్యాక్సిన్ ప్రయోగాలు.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌లోనూ చైనాకు చెందిన రెండు వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే చైనా టీకాలను అందిస్తున్నట్లు సమాచారం. పాక్‌తో పాటు ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోనూ చైనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆయా దేశాల్లో వ్యాక్సిన్‌పై నమ్మకాన్ని సాధించడంలో చైనా విఫలమైనట్లు సర్వేలు, నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక పాకిస్థాన్ ప్రజలు కూడా చైనా వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
చైనా వ్యాక్సిన్ ప్రయోగాలను దాదాపు 16దేశాల్లో కొనసాగిస్తోంది. బ్రెజిల్, టర్కీ, ఫిలిప్పైన్స్, మొరాకో, అర్జెంటీనా, పాకిస్థాన్, మెక్సికో, సౌదీ దేశాల్లో ప్రయోగాలు కొనాసాగుతున్నాయి. అయితే బ్రెజిల్‌లో నిర్వహిస్తోన్న ప్రయోగాల్లో చైనా వ్యాక్సిన్ కేవలం 50శాతానికిపైగా సక్సెస్ అయింది. అయితే కరోనా వ్యాక్సిన్ సమర్థతపై ఇంకా స్పష్టమైన అధికారిక ప్రకటన మాత్రం బయటకు రాలేదు. దీనిపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కూడా బహిరంగంగానే వ్యతిరేకించారు. తాజాగా బ్రెజిల్‌లో జరిపిన ఓ ప్రైవేటు సర్వేలోనూ చైనా వ్యాక్సిన్‌ను తీసుకోబోమని సర్వేలో పాల్గొన్న సగంమంది అసంతృప్తితో ఉన్నారు.
ఇక కెన్యాలో జరిపిన మరో సర్వేలోనూ చైనా, రష్యాలో తయారైన వ్యాక్సిన్‌లపై మెజారిటీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. యూకే, అమెరికా వ్యాక్సిన్‌లపైనే వారు మొగ్గుచూపారు. హాంగ్‌కాంగ్ ప్రజలు కూడా చైనా వ్యాక్సిన్ ఒక్కటే కాకుండా ఫైజర్, సినోవాక్, ఆస్ట్రాజెనెకాకు చెందిన టీకాల్లో ఇష్టమైన దాన్ని తీసుకోవచ్చని స్థానిక అధికారులు ప్రకటించారు. చైనా వ్యాక్సిన్‌లను ఇప్పటికే అక్కడ లక్షల మందికి అందిస్తోంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా ఉత్పత్తులపై నమ్మకం మరింత సన్నగిల్లడంపై ఆ ప్రభావం వ్యాక్సిన్‌లపై కూడా పడినట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ తొలుత బయటపడిన చైనాలో.. వైరస్ వ్యాప్తిని చాలావరకు సాధ్యమైనంత తొందరగానే నియంత్రించగలిగింది. కానీ, కరోనా మూలాలు, హాంగ్‌కాంగ్, షిన్‌జియాంగ్ వంటి విషయాల్లో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కయ్యానికి కాలుదువ్వింది. ఇటు భారత్‌తోనూ ఘర్షణ వాతావరణాన్నే కొనసాగిస్తోంది. దీంతో చాలా దేశాలు చైనా ఉత్పత్తులపై విముఖత చూపిస్తున్నాయి. అదేసమయంలో చైనా ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగినట్లు పలు నివేదికలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌పై నమ్మకం కలిగించేందుకు చైనా శతవిధాలా ప్రయత్నిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com