China: ప్రమాదకర వైరస్‌పై చైనా ప్రయోగాలు

కొవిడ్ మహమ్మారి భయం నుంచి ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తరుణంలో మరో ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా జాతికి చెందిన ఓ ప్రమాదకరప్రమాదకర వైరస్‌పై చైనా ప్రయోగాలు ప్రయోగాలు చేస్తున్నట్టు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఆ వైరస్‌తో మరణాల రేటు వందశాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. చైనా ప్రయోగాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు...తక్షణం అలాంటి ప్రయత్నాలు ఆపాలని సూచిస్తున్నారు.
కొవిడ్ వైరస్ పుట్టుకకు చైనాయే కారణమని ప్రపంచ దేశాలు ఇప్పటికే చైనా దేశంపై విమర్శలు గుప్పించగా...తాజాగా మరో వైరస్‌కు జీవంపోస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. వుహాన్‌లో జరిపిన ఓ అధ్యయనంతో ఈ విషయం బయటపడినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఆ అధ్యయనం ప్రకారం సార్స్- కోవ్-2కు చెందిన జీఎక్స్-పీ2వీ అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది 2017లో వెలుగుచూసిన జీఎక్స్ ఉత్పరివర్తనమని సమాచారం. గతంలో ఈ వైరస్‌ను మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు.
జీఎక్స్-పీ2వీ మ్యుటేటెడ్ వెర్షన్‌ను శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించారని పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. వాటిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించటంతోపాటు 8రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయని వెల్లడించాయి. తొలి ఐదురోజుల్లో ఎలుకలు బరువు తగ్గి బలహీనంగా మారాయని, నడవలేనిస్థితి వల్ల వాటి ఆరోగ్యం క్షీణించినట్లు పేర్కొన్నాయి. ఎలుకల ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడు దెబ్బతిన్నాయనీ...కళ్లు తెలుపు రంగులోకి మారినట్టు అధ్యయనం తెలిపింది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమని...మరణాలరేటు 100 శాతంగా ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించింది. ఈ వైరస్ మనుషులపై ఏ మేరకు ప్రభావం చూపనుందనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. మనుషులపైనా దాదాపు ఎలుకలపై మాదిరిగానే ప్రభావం ఉండొచ్చంటున్న విశ్లేషకులు...చైనా అలాంటి ప్రయోగాలను విరమించుకోవాలని సూచిస్తున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com