China Space Station: షెన్‌జౌ-19 అంతరిక్ష యాత్రను ప్రారంభించిన చైనా.

China Space Station: షెన్‌జౌ-19 అంతరిక్ష యాత్రను ప్రారంభించిన చైనా.
X
ఈ మిషన్‌లో చైనా తొలి మహిళా స్పేస్ ఇంజనీర్.

టియాన్‌గాంగ్ స్పేస్ స్టేష‌న్‌ కు ముగ్గురు వ్యోమ‌గాముల‌ను చైనా పంపింది. షెంజౌ-19 మాన‌వ‌స‌హిత స్పేస్‌షిప్‌ను చైనా ప్ర‌యోగించింది. లాంగ్ మార్చ్‌-2ఎఫ్ రాకెట్ ద్వారా ముగ్గురు టైకోనాట్లు నింగిలోకి వెళ్లారు. ఇవాళ తెల్ల‌వారుజామున 4.27 నిమిషాల‌కు జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంట‌ర్ నుంచి రాకెట్ ఎగిరింది. ఈసారి వ్యోమ‌గాముల్లో మ‌హిళా టైకోనాట్ కూడా ఉన్న‌ది. టియాన్‌గాంగ్ స్పేస్ స్టేష‌న్‌లో వ్యోమ‌గామ‌లు ప‌లు ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌నున్నారు. 2030 నాటికి చంద్రుడి మీద‌కు చైనా వ్యోమ‌గాముల‌ను పంపాల‌ని భావిస్తున్న‌ది. లూనార్ కేంద్రాన్ని నిర్మించాల‌నుకుంటున్న చైనా ఆ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.

టైకోనాట్ల‌లో 34 ఏళ్ల వాంగ్ హౌజీ అనే మ‌హిళా ఆస్ట్రోనాట్ ఉన్నారు. స్పేస్ స్టేష‌న్‌కు వెళ్లిన మ‌హిళా ఆస్ట్రోనాట్ల‌లో ఆమె మూడ‌వ వ్య‌క్తి కావ‌డం విశేషం. రాకెట్ ప్ర‌యోగం స‌క్సెస్ అయిన‌ట్లు చైనా స్పేస్ ఏజెన్సీ ప్ర‌క‌టించింది. కాయి జూజీ నేతృత్వంలో ముగ్గురు వ్యోమ‌గాములు నింగిలోకి వెళ్లారు. ఏప్రిల్ లేదా మే నెల‌లో వాళ్లు మ‌ళ్లీ భూమ్మీద‌కు రానున్నారు. కాయి జూపీ గ‌తంలో 2022లో షెంజౌ-14 మిష‌న్ ద్వారా స్పేస్ స్టేష‌న్‌కు వెళ్లారు. ఆస్ట్రోనాట్ల‌లో 34 ఏళ్ల సాంగ్ లింగ్డాంగ్ కూడా ఉన్నారు.

ఈ మిషన్‌లోని వ్యోమగాములు అంతరిక్ష శాస్త్రం, అప్లికేషన్‌ల పరీక్షలను నిర్వహించడం, రక్షణ పరికరాలను ఇన్‌స్టాల్ చేయడం ఇంకాఅదనపు వాహన పేలోడ్‌లు, పరికరాల ఇన్‌స్టాలేషన్, రీసైక్లింగ్‌ను నిర్వహించడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. స్పేస్ లైఫ్ సైన్స్, మైక్రోగ్రావిటీ ఫండమెంటల్ ఫిజిక్స్, స్పేస్ మెటీరియల్స్ సైన్స్, స్పేస్ మెడిసిన్, కొత్త స్పేస్ టెక్నాలజీలతో సహా అనేక రంగాలను కవర్ చేస్తూ 86 స్పేస్ సైన్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ప్రయోగాలు నిర్వహిస్తారని CMSA ప్రతినిధి లిన్ జికియాంగ్ మంగళవారం తెలిపారు. చైనా తన అంతరిక్ష కేంద్రంలో 130కి పైగా సైంటిఫిక్ రీసెర్చ్, అప్లికేషన్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించిందని ఏప్రిల్‌లో CMSA వెల్లడించింది.

Tags

Next Story