కరోనా కేంద్రం వూహాన్ లో ప్రజల జలకాలాటలు: వీడియో

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వైరస్ బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ వైరస్ కేంద్రం వుహాన్ ప్రజలు హాయిగా స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఒక్కరు కూడా మాస్క్ ధరించకుండా మజా చేస్తున్నారు. పూల్ పార్టీలు, నైట్ క్లబ్ లు, నైట్ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కోవిడ్ ప్రోటోకాల్ ను ఎవరూ పాటించలేదు. దీనిని బట్టి వూహాన్ సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ మూలాలను ప్రారంభదశలోనే గుర్తించినప్పటికీ ఆ విషయాన్ని దాచి పెట్టినందుకు చైనాపై ప్రపంచ దేశాల నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి అధిక సంఖ్యలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైరస్ కు సంబంధించిన అధికారిక గణాంకాలను విడుదల చేసే విషయంపై కూడా చైనాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు వైరస్ ను ప్రపంచానికి అంటించి వాళ్లంతా కూల్ గా ఉన్నారని విరుచుకుపడుతున్నారు. మరొకరు వీళ్లు మనుషులేనా.. వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మృత్యువాతకు గురయ్యారు. ఎంతో మంది ఉపాధి, ఉద్యోగావకాశాలను కోల్పోయారు. యుఎస్ఎ, ఇండియాతో సహా ప్రపంచం మొత్తం బాధపడుతున్నప్పుడు చైనాలో ముఖ్యంగా వైరస్ కేంద్రంలో సాధారణ పరిస్థితి ఎలా చోటు చేసుకుందో అర్థం కావట్లేదు. ప్రపంచ సంస్థ దీనిపై దర్యాప్తు ప్రారంభించాలి అని మరొక నెటిజన్ పేర్కొన్నారు.
Pool parties, nightclubs and night snacks at food stalls - the lively nightlife returns to Wuhan. pic.twitter.com/ZKoA5O2pl6
— Hu Xijin 胡锡进 (@HuXijin_GT) August 31, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com