China : యువ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపిన చైనా

అతిపిన్న వయస్కులతో కూడిన వ్యోమగాముల బృందాన్ని చైనా తమ అంతరిక్ష కేంద్రానికి పంపింది. షెన్‌ఝూ-17 స్పేస్ షిప్‌తో కూడిన లాంగ్‌మార్చ్-2ఎఫ్ రాకెట్‌ను గోబి ఎడారిలోని ప్రయోగ కేంద్రం నుంచి చైనా ప్రయోగించింది. 38 ఏళ్ల సగటు వయస్సున్న ముగ్గురు వ్యోమగాములు ఈ బృందంలో ఉన్నారు. తంగ్ హోంగ్‌బో, తంగ్ షెన్‌జియె, జియాంగ్ గ్జిన్లిన్‌లతో కూడిన బృందం అంతరిక్ష కేంద్రంలో 6 నెలలు సేవలందించనుంది. వీరికి అనుభవజ్ఞుడైన తంగ్ హోంగ్‌బో నాయకత్వం వహిస్తారు. 2030 చివరి నాటికి చంద్రుని మీదకు వ్యోమగాములను పంపానన్న లక్ష్యంతో చైనా వరుసగా అంతరిక్ష ప్రయోగాలను చేస్తోంది. రోదసీలో పరిస్థితులను, నక్షత్రాలను నిశితంగా పరిశీలించడానికి త్వరలో టెలిస్కోప్‌ను పంపనున్నట్లు చైనా తెలిపింది.
చైనాకు చెందిన పిన్న వయస్కులైన వ్యోమగాములు రికార్డు సృష్టించారు. అంతరిక్ష నౌకను ప్రయోగించిన ఆరున్నర గంటల్లోనే ఆ దేశానికి చెందిన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ముగ్గురు చైనీస్ వ్యోమగాములతో కూడిన షెంజౌ-17 అంతరిక్ష నౌకను జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి గురువారం లాంచ్ చేశారు. అనంతరం 6.5 గంటల్లోనే టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం ఫార్వర్డ్ పోర్ట్‌కు ఆ స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా డాక్ అయ్యింది. ఆ దేశ అంతరిక్ష ప్రయోగ సెంటర్ కమాండర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కాగా, అంతరిక్షంలో వేరుగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి ఆరోసారి వ్యోమగాములను చైనా పంపింది. అయితే ఈసారి అతి పిన్న వయస్కులైన వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపడం 12వ మిషన్ ప్రత్యేకత. సుమారు ఆరు నెలలపాటు టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేస్తారు. మరోవైపు ఈ ఏడాది మే నుంచి టియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌లో ఉన్న షెన్‌జౌ-16 క్రూ సిబ్బంది స్థానాన్ని షెన్‌జౌ-17 వ్యోమగాములు భర్తీ చేస్తారు. షెన్‌జౌ-16 క్రూ సిబ్బంది అక్టోబర్ 31న భూమికి తిరిగి చేరుకుంటారు. కాగా, అమెరికన్, యూరోపియన్లు వ్యవహరించే ఆస్ట్రోనాట్స్, సోవియట్ లేదా రష్యన్ ‘కాస్మోనాట్స్’కు భిన్నంగా చైనా వ్యోమగాములను ‘టైకోనాట్స్’ అని పిలుస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com