Zhong Yang: చైనా ‘బ్యూటిఫుల్ గవర్నర్’కు 13 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ..
చైనాలో ఓ మహిళా ఆఫీసర్‌కు 13 ఏళ్ల జైలుశిక్ష పడింది. ప్రవర్తన సరిగా లేదని ఆమెకు సుమారు కోటిన్నర ఫైన్ కూడా వేశారు. చూడటానికి అందంగా కనిపించే జాంగ్ యాంగ్ అనే మహిళ.. గుజావ్ ప్రావిన్సులో సీపీసీ పార్టీ గవర్నర్‌గా, డిప్యూటీ సెక్రటరీగా చేసింది. ఆమెకు బ్యూటీఫుల్ గవర్నర్(Beautiful Governor) అన్న నిక్‌నేమ్ ఉన్నది. అయితే ఆమె తన చూపుల వలతో అనేక మందిని బుట్టలో వేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పదవిలో తనకన్నా చిన్నవారైన 58 మంది మగ ఆఫీసర్లతో ఆమె లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి వద్ద నుంచి ఆమె సుమారు 60 మిలియన్ల యువాన్లు లంచంగా తీసుకున్నట్లు కూడా అభియోగం నమోదు అయ్యింది.
22 ఏళ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీలో చేరిన జాంగ్‌కు ఇప్పుడు 52 ఏళ్లు. జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీలో ఆమె ప్రస్తుతం డిప్యూటీ ర్యాంక్‌లో ఉన్నది. రైతులకు సాయం చేసేందుకు ఫ్రూట్ అండ్ అగ్రికల్చర్ అసోసియేషన్‌ను ఆమె ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పెట్టుబడులు, అభివృద్ధి పేరుతో ఆమె మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోని కంపెనీలను ఆమె పట్టించుకునేది కాదు అని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
క్రమశిక్షణా, చట్టపరమైన ఉల్లంఘనలకు జాంగ్ పాల్పడినట్లు గుజావ్ ప్రావిన్షియల్ కమిటీ తన తీర్పులో పేర్కొన్నది. 58 మంది మగ సిబ్బందితో ఆమె అఫైర్ పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇచ్చిన ఆఫర్లను స్వీకరించిన వారు ఆమెకు లవర్లుగా ఉండిపోయారు. కొందరు ఆమెకు భయపడి .. ఆమెకు లొంగిపోయారు. ఓవర్‌టైం వర్క్, బిజినెస్ ట్రిప్ పేర్లతో ఆమె తన లవర్స్‌తో సమయం గడిపేదని తేలింది. ఏప్రిల్ 2023లో ఆమెను అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో పదవి నుంచి తొలగించారు. సీపీసీ నుంచి ఆమెను వెలివేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com