China: దొంగలు కాదు ఉద్యోగులు.. కంపెనీ ఇచ్చిన కోట్ల రూపాయల బోనస్

China: దొంగలు కాదు ఉద్యోగులు.. కంపెనీ ఇచ్చిన కోట్ల రూపాయల బోనస్
China: బిక్కు బిక్కు మంటూ ఆఫీస్‌కి రావడం.. ఎప్పుడు ఊడుతుందో తెలియని ఉద్యోగం.. ఇదీ నేటి ఉద్యోగుల పరిస్థితి.

China: బిక్కు బిక్కు మంటూ ఆఫీస్‌కి రావడం.. ఎప్పుడు ఊడుతుందో తెలియని ఉద్యోగం.. ఇదీ నేటి ఉద్యోగుల పరిస్థితి.. పెద్ద పెద్ద కంపెనీలు సైతం లేఆఫ్ అంటూ ఉద్యోగులను ఇంటికి పంపించేస్తుంటే చైనా కంపెనీ మాత్రం లాభాలు వచ్చాయని ఉద్యోగులకు భారీ ఎత్తున బోనస్ ప్రకటించింది.

వారి పేరుతో అకౌంట్‌లో వేస్తే ఎవరికి తెలుస్తుంది. అందుకే ఆఫీస్ వరండాలో నోట్ల కట్టలను గుట్టలుగా పేర్చింది. సదరు ఉద్యోగులను పిలిచి నోట్ల కట్టలు చేతిలో పెట్టింది. ఇదంత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చైనాకు చెందిన హెనాన్ మైన్ అనే కంపెనీ క్రేన్లను ఉత్పత్తి చేస్తుంది. కరోనా క్రైసిస్ కారణంగా పలు కంపెనీలు దివాళా తీసినా హెనాన్‌కు ఆ ఎఫెక్ట్ ఏమీ పడలేదు. అంతే కాదు లాభాలు కూడా వచ్చాయి. దాంతో కంపెనీ లాభాల్లో పయనించడానికి కారణమైన ఉద్యోగులను ప్రశంసించింది.

వారికి భారీ బహుమతులు ఇచ్చి సత్కరించాలనుకుంది. సదరు ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. సేల్స్ విభాగంలో ప్రతిభ కనబరిచిన 30 మందికి పైగా ఉద్యోగులకు 61 మిలియన్ యువాన్లు (సుమారు 73 కోట్లు) బోనస్‌గా ప్రకటించింది.

ఈ మొత్తాన్ని ఉద్యోగులకు పంచేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. 73 కోట్ల రూపాయల్ని స్టేజ్‌పై పేర్చింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురు ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఐదు మిలియన్ యువాన్లు అంటే సుమారు రూ.6 కోట్లు అందించింది.

మిగిలిన వారికి ఒక్కొక్కరికి ఒక మిలియన్ యువాన్ (రూ.1.20 కోట్లు) బోనస్‌గా ఇచ్చింది. దీంతో కంపెనీ అందించిన నోట్ల కట్టలను ఉద్యోగులు చేతులతో తీసుకెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story