రెస్టారెంట్‌లో తింటున్నవారిని గొడ్డలితో నరికిన చైనా యువకుడు!

న్యూజిలాండ్‌లోని, ఆక్లాండ్‌లో మూడు చైనీస్ రెస్టారెంట్లలో ఆగంతకుడు విచక్షణారహితంగా విరుచుకుపడ్డాడు. తినడానికి వచ్చిన అతిథులపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు ఓ చైనీయుడు. ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి జాంగ్లియాంగ్ మలాటాంగ్, యూస్ డంప్లింగ్ కిచెన్, మయా హాట్‌పాట్ అనే మూడు రెస్టారెంట్‌లలో జరిగిన దాడులతో ఆక్లాండ్ నగరం అట్టుడికిపోయింది. అప్పటి వరకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో రెస్టారెంట్‌కి వచ్చి సంతోషంగా గడుపుతున్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చేతిలో గొడ్డలి పట్టుకుని అక్కడికి వచ్చిన ఓ 24 ఏళ్ల యువకుడు ఉన్నటుండి టేబుల్‌పై వద్ద కూర్చున్న వారిపై దాడికి దిగాడు. కొందరిని వెంటాడి మరీ గాయపరిచాడు. ఆ తర్వాత మరో రెస్టారెంట్‌లోకి చొరబడి అదే తంతు కొసాగించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ దాడి వెనుక ఎటువంటి జాతి పరమైన విద్వేషాలు ఉన్నట్లు ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, ఆ వ్యక్తి ఇలా ఎందుకు ప్రవర్తించాడనేది తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com