China : చైనాకు కొత్త అధ్యక్షుడు?.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
China : చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్పదవి నుంచి తప్పుకోబోతున్నారని అక్కడి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

China : చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్పదవి నుంచి తప్పుకోబోతున్నారని అక్కడి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కరోనా నిర్వహణలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా, చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి జిన్‌పింగ్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే ఆయనను చైనా కమ్యూనిస్టు పార్టీ పక్కకు పెట్టబోతోందని వదంతులు వ్యాపిస్తున్నాయి. సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రచారం మొదలైంది. చైనా పాలనలో ఈ నాయకత్వ బృందమే అత్యంత కీలకం.
ఈ సమావేశం అనంతరం కెనడాకు చెందిన బ్లాగర్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ.. కొద్ది నెలల్లో కీలక సమావేశాన్ని నిర్వహిస్తుందని, ఆ లోపే జిన్‌పింగ్‌ను పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించిందని చెప్పాడు. అంతేకాదు ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్‌ను తదుపరి చైనా అధ్యక్షుడిగా పార్టీ నియమిస్తుందని పేర్కొన్నాడు. పార్టీ నుంచి, పదవి నుంచి జిన్పింగ్వైదొలుగుతారని వివరించాడు.
కరోనా కట్టడి కోసం జీరో కోవిడ్ పాలసీ పేరుతో అత్యంత కఠిన ఆంక్షలు విధించారు జిన్‌పింగ్. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేగాక వ్యాపార సంస్థలపై కూడా ఆంక్షల వల్ల తీవ్ర ప్రభావం పడింది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితమైంది. చైనా యువాన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో 4శాతం వరకు పడిపోయింది. గత 28 ఏళ్లలో ఇంత కనిష్ఠానికి పడిపోవడం ఇదే తొలిసారి. కరోనా ఒక్క కారణం తప్ప ఆర్థిక వ్యవస్థ గురించి జిన్‌పింగ్ ఆలోచించలేదని, ప్రజలను ఇబ్బందిపెట్టడమే గాక ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి కారణమయ్యారని జిన్‌పింగ్‌పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పదవి నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతోంది.
అటు.. జిన్ పింగ్ మెదడు సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటి వరకు దీన్ని చైనా ప్రభుత్వం ధృవీకరించలేదు. ఆయన చైనీయుల సాంప్రదాయ వైద్య చికిత్సను తీసుకుంటున్నట్టు సమాచారం. సర్జరీకి బదులుగా ఆయన ఈ చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో చాలా కాలం నుంచి విదేశీ నేతలను ఆయన కలవడం లేదు. 2019లో ఇటలీ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ఆయన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సమయంలో నడిచేందుకు ఇబ్బందిపడుతూ కనిపించారు. కుర్చీలో కూర్చోవడానికి కూడా ఆయన ఇతరుల సాయం తీసుకున్నారు.
RELATED STORIES
CBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యూరో ఆఫ్...
24 May 2022 4:43 AM GMTIAF Group C Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో...
23 May 2022 4:42 AM GMTSouthern Railway Sport Quota Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో...
21 May 2022 5:15 AM GMTIndian Army TGC-136 Course application 2022: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ...
20 May 2022 4:45 AM GMTHAL Teacher Recruitment 2022 : డిగ్రీ, పీజీ అర్హతతో హెచ్ఏఎల్ ల్లో...
19 May 2022 4:30 AM GMTMinistry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMT