Chinese 'SPY' Balloon : చైనా బెలూన్ ను కూల్చేసిన అమెరికా

Chinese SPY Balloon : చైనా బెలూన్ ను కూల్చేసిన అమెరికా
చైనా బెలూన్ ను అమెరికా ఆర్మీ కూల్చివేయగా, అట్లాంటిక్ లో పడిపోయింది. బెలూన్ శిథిలాలను అమెరికా నేవీ సేకరిస్తుంది.


అమెరికా గగన తలంలో వారం రోజులుగా ఎగురుతున్న చైనా బెలూన్ ను కూల్చి వేసింది యూఎస్ ఆర్మీ. అమెరికా ఫైటర్ జెట్ లు శనివారం దక్షిణ కరోలినా తీరంలో బెలూన్ ఎగురుతున్నప్పుడు కూల్చివేశాయి. దీంతో చైనా అమెరికా సంబంధాలు దిగజారినట్లుగా తెలుస్తోంది. వాతావరణ పరిశీలన ఎయిర్ షిప్ అని చైనా పేర్కొనగా.. అమెరికా సార్వభౌమత్వ ఉల్లంఘనగా వైట్ హౌస్ అసహనం వ్యక్తం చేసింది. నిరసనగా, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు.

చైనా బెలూన్ ను అమెరికా ఆర్మీ కూల్చివేయగా, అట్లాంటిక్ లో పడిపోయింది. బెలూన్ శిథిలాలను అమెరికా నేవీ సేకరిస్తుంది. చైనా బెలూన్ అమెరికా అణుస్థావరం వద్ద తిరగడంతో వైట్ హౌస్ తీవ్రంగా పరిగణించింది. వర్జీనియాలో లాంగ్లే ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన ఓ ఫైటర్ జెట్, క్షిపణిని ప్రయోగించి బెలూన్ ను కూల్చివేసింది.


Tags

Read MoreRead Less
Next Story