Christmas celebrations : దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు..!

Christmas celebrations : దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ పండగ కళను సంతరించుకున్నాయి. భక్తులంతా అర్ధరాత్రి నుంచే వేడుకల్లో పాల్గొన్నారు. కోవిడ్, ఒమిక్రాన్ మహమ్మారులను దృష్టిలో పెట్టుకొని నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రఖ్యాత మెదక్ CSI చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
వాటికన్ సిటీ తరహాలో శిలువ ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదట శిలువ ఊరేగింపు నిర్వహించారు.. అనంతరం మొదటి ఆరాధనలో పాల్గొన్న భక్తులకు చర్చి బిషప్ సాల్మన్‌రాజ్ దైవసందేశం వినిపించారు. వేడుకల సందర్భంగా చర్చి ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో... అందంగా అలంకరించారు.
ఆసియాలో అతి పెద్దదైన సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు పరిసరప్రాంతాల వాసులు భారీగా తరలిరానుండటంతో.. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. మెదక్ చర్చీలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. హైదరాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని పలు చర్చీలతో పాటు మియాపూర్ కల్వరి టెంపుల్‌లో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com