Australia: క్లీనింగ్ ఉద్యోగం.. కోట్లల్లో ఆదాయం

Australia: క్లీనింగ్ ఉద్యోగం.. కోట్లల్లో ఆదాయం
Australia: ఇళ్ళలో పనిచేసేవారికి ఇక్కడ ఇచ్చే జీతం రూ.1500 ల నుంచి 2 వేల వరకు ఉంటుంది.

Australia: ఇళ్ళలో పనిచేసేవారికి ఇక్కడ ఇచ్చే జీతం రూ.1500 ల నుంచి 2 వేల వరకు ఉంటుంది. అదే కార్యాలయాల్లో చేస్తే కాస్త ఎక్కువే ఉండొచ్చు. అంటే 10 నుంచి 15వేల లోపు.. కానీ ఆశ్చర్యంగా ఆస్ట్రేలియాలో అదే పనికి కోటి రూపాయల వరకు జీతం ఇస్తున్నారట.

సాధారణంగా సాప్ట్‌వేర్ ఉద్యోగులకు లక్షల్లో జీతం ఉంటుంది.. ప్రముఖ కంపెనీలు అయితే కోటి ఇచ్చి కూడా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో శానిటైజేషన్ వర్కర్ల కొరత కారణంగా అడిగినంత ఇచ్చేస్తున్నారు.. వచ్చిన వ్యక్తిని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు ఏ కంపెనీ కూడా. కోటి రూపాయల జీతం ఇచ్చి శానిటైజేషన్ వర్కర్లను నియమించుకుంటున్నాయంటే వినడానికి ఆశ్యర్యంగానే ఉన్నా.. ఆ పనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా సదరు సంస్థలు వేతనాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఆస్ట్రేలియాలో క్లీనింగ్ సర్వీస్ కంపెనీలు.. ఉద్యోగులకు గంటల వ్యవధిలో భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. 2021 నుంచి వీరికి అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది. గతంలో గంటకు రూ.2700 ఇస్తే ఇప్పుడు రూ.3500 ఇస్తున్నాయి. అత్యవసర సమయాల్లో అయితే గంటకు రూ.4700 చెల్లించేందుకు కూడా వెనుకాడట్లేదు. సిడ్నీకి చెందిన అబ్సల్యూట్ డొమెస్టిక్ సంస్థ ఈ విషయాలను వెల్లడించింది.

ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసే వారికి చాలా కంపెనీలు గంటల వ్యవధిలో శాలరీలు ఇస్తుంటాయి. వారికి సగటు జీతం రూ.72 లక్షల నుండి రూ.80 లక్షల వరకు చేరింది. అయితే చాలా కంపెనీలు ఆ వేతనాన్ని రూ.98 లక్షలకు పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒక్క ఆస్ట్రేలియాలోనే కాదు బ్రిటన్‌లో కూడా శానిటైజేషన్ వర్కర్స్‌కి ఇదే తరహాలో జీతాలు అందుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story