Hottest Month : ఆగస్టులో అత్యధిక ఉష్ణోగ్రతలు

భూ ఉత్తర అర్ధగోళంలోనే చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఈ ఆగస్టు నిలిచింది. భూ ఉత్తర అర్ధగోళంలో ఈ నెలలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నెలగా జులై తొలి స్థానంలో ఉండగా ఇప్పుడు ఆగష్టు 2వ స్థానంలో నిలిచింది. . ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థతో పాటు యూరోపియన్ క్లైమేట్ సర్వీస్ కోపర్నికస్ ప్రకటించింది.
ప్రపంచ వాతావరణ సంస్థతో పాటు యూరోపియన్ క్లైమేట్ సర్వీస్ కోపర్నికస్ ఆసక్తికర విషయాన్ని ప్రకటించాయి. ఆధునిక పరికరాలతో ఇప్పటి వరకు రికార్డ్ చేసిన ఉష్ణోగ్రతలలో ఈ ఏడాది జులై ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా ఈ ఆగస్టు నెల జులై తర్వాతి రెండో స్థానాన్ని ఆక్రమించుకున్నట్టు తెలిపాయి. ఆగస్టులో పారిశ్రామిక పూర్వ సగటు కంటే దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వేడి నమోదైంది. ఇది ప్రపంచం దాటకూడదని ప్రయత్నిస్తున్న వేడెక్కుతున్న థ్రెషోల్డ్‌ను చేరుకుంది.కానీ 1.5 డిగ్రీల సెల్సియస్ థ్రెషోల్డ్ అన్నది దశాబ్దాలుగా ఉండటంతో శాస్త్రవేత్తలు దీన్ని అంత ముఖ్యమైనదిగా పరిగణించరు. ఇప్పటివరకు 2016 తర్వాత.......... 2023 వ సంవత్సరం రెండో అత్యంత వేడైన ఏడాదిగా మారినట్టు కోపర్నికస్ తెలిపింది. ఎల్ నినో పరిస్థితులకు అదనంగా మానవుని వల్ల సంభవించే బొగ్గు,చమురు,సహజవాయువుల విడుదల దీనికి మరింత ఆజ్యం పోసినట్టు ఆరోపించింది.వాతావరణ మార్పు ఎంతలా పెరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమయ్యే పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని భాగాలు తాత్కాలిక వేడెక్కేంతలా అని శాస్త్రవేత్తలు తెలిపారు.
సాధారణంగా ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభమైన ఎల్ నినో....ప్రపంచ ఉష్ణోగ్రతలకు అదనపు వేడిని జోడిస్తుంది కానీ రెండో ఏడాదిలో మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ వాతావరణ సంస్థ, కోపర్నికస్ ప్రకటించిన సంఖ్యను చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని....వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికి కూడా గ్లోబల్ వార్మింగ్ సమస్యను ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించటం లేదని విచారం వ్యక్తం చేశారు. భారీ వృక్షాల కాండాలలోని వలయాలు, మంచు పర్వతాల అంచులు, ఇతర పద్ధతులను ఉపయోగించి ఉష్ణోగ్రతలు సుమారు లక్ష 20వేల సంవత్సరాలలో కంటే ఇప్పుడు వేడిగా ఉన్నాయని అంచనా. ప్రపంచం ఇంతకు ముందు కూడా వేడిగా ఉండేది కానీ అది మానవ నాగరికతకు ముందు అని వివరించారు. అప్పుడు సముద్రాలు చాలా ఎత్తుగా ఉండేవని ధ్రువాలు మంచుతో నిండి ఉండేవి కావని తెలిపారు. ఈ సెప్టెంబర్ నెలలో రోజువారీ ఉష్ణోగ్రతలు పోయిన ఏడాది కంటే ఎక్కువగా ఉన్నాయని మైనే విశ్వవిద్యాలయం క్లైమేట్ రీఅనలైజర్ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com