19 Nov 2021 3:52 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / Coffee Benefits: మీకు...

Coffee Benefits: మీకు కోవిడ్ ఉందనే అనుమానం ఉందా..? అయితే కాఫీ తాగండి.. ఇట్టే తెలిసిపోతుంది..

Coffee Benefits: కాఫీ.. ఈ పేరులోనే ఒక విధమైన రిఫ్రెష్‌మెంట్ ఉంది కదా..

Coffee Benefits (tv5news.in)
X

Coffee Benefits (tv5news.in)

Coffee Benefits: కాఫీ.. ఈ పేరులోనే ఒక విధమైన రిఫ్రెష్‌మెంట్ ఉంది కదా.. ఎన్ని రకాల కూల్ డ్రింక్స్ వచ్చినా.. హాట్ బెవరేజెస్ వచ్చినా.. కాఫీ, టీని కొట్టగలిగేవి ఏవీ లేవు. కాఫీ వల్ల ఆరోగ్యానికి ఎంత మంచి ఉందో.. అంతే చెడు కూడా ఉంటుంది. అందుకే తక్కువ మోతాదులో కాఫీ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తూ ఉంటారు. తాజాగా కాఫీ వల్ల మరో ఉపయోగాన్ని వైద్యులు వెల్లడించారు.

కాఫీ రుచిని ఎంతమంది ఇష్టపడతారో.. దాని అరోమాను అంతకంటే ఎక్కువమందే ఇష్టపడతారు. కాఫీ పరిమళంలో ఉండే మత్తు ఇంకా ఏ హాట్ బెవరేజ్‌లో ఉండదు. కాఫీ తాగే ముందు ఎంతసేపైనా ఈ అరోమాను ఆస్వాదించడం కాఫీ లవర్స్‌కు అలవాటు. ఈ అరోమానే మనకు కోవిడ్ ఉందా లేదా అని బయటపెట్టే అస్త్రంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

కాఫీ నుండి వచ్చే పరిమళం చాలా ఘాటుగా ఉంటుంది. అంటే అది ముక్కు దగ్గర పెట్టుకోగానే ఒక్కసారిగా ఆ పరిమళం మనల్ని కమ్మేస్తుంది. అయితే ఒకవేళ అలా జరగలేదంటే.. కోవిడ్ ఉన్నట్టు అనుమానించాల్సందే అంటున్నారు వైద్యులు. వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం కోవిడ్ లక్షణాలలో ఒకటి కాబట్టి కాఫీకంటే ఘాటైన పరిమళం మరేం ఉంటుంది. అందుకే ఆ పరిమళాన్ని ఆస్వాదించలేకపోతే కోవిడ్ లక్షణం ఉన్నట్టే అని వారు చెప్తున్నారు.

Next Story