ship sinks off: గ్రీక్ ద్వీపంలో మునిగిన కార్గో షిప్

ship sinks off: గ్రీక్ ద్వీపంలో మునిగిన  కార్గో షిప్
నలుగురు భారతీయులు సహా 13 మంది గల్లంతు

గ్రీస్‌ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో బలమైన గాలుల కారణంగా అల్లకల్లోల పరిస్థితుల్లో కార్గో నౌక మునిగిపోవడంతో 13 మంది గల్లంతయ్యారు. వీరిలో నలుగురు భారతీయులున్నారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 14 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఒకరిని సహాయక సిబ్బంది రక్షించారు. మిగిలిన 13 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నుంచి రాప్టర్‌ అనే కార్గో నౌక.. ఆరు వేల టన్నుల ఉప్పుతో తుర్కియే లోని ఇస్తాంబుల్‌ బయలుదేరింది. మార్గం మధ్య లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు నౌకలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే సమీప కేంద్రానికి ప్రమాద సంకేతాన్ని పంపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ నౌక కనిపించకుండా పోయినట్లు స్థానిక కోస్ట్‌ గార్డ్‌ వెల్లడించింది. రంగంలోకి దిగిన రెస్య్క్యూ బృందాలు ముమ్మర గాలింపు మొదలుపెట్టాయి.

‘టైటానిక్’ సినిమాలో భారీ నౌక మంచుకొండని ఢీకొని మునిగిపోయినట్టు ఓ కార్గో షిప్ కూడా అప్పటివరకూ తన ప్రయాణాన్ని సజావుగా కొనసాగించిన బోల్తా పడి మునిగిపోయింది. బలమైన ఈదురుగాలుల కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు తేలింది. లెస్బోస్ ద్వీపం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


ఉప్పుతో లోడ్ చేయబడిన ఈ కార్గొ షిప్ ఈజిప్టులోని దేఖీలా నుండి ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. ఇది ప్రభుత్వానికి చెందిన ఓడ. ఇందులో మొత్తం 14 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఇద్దరు సిరియన్ పౌరులు, నలుగురు భారతీయులు, ఎనిమిది మంది ఈజిప్షియన్లు ఉన్నారు. ఈ నౌక ఎక్కడైతే మునిగిందో.. అక్కడ ఈదురుగాలుల వేగం ‘బ్యూఫోర్ట్ స్కేల్‌లో’ 9-10కి చేరుకోవడంతో శనివారమే గ్రీస్‌లోని అనేక ప్రాంతాల్లో నౌకలు పోర్టులకే పరిమితమయ్యాయి. కానీ.. ఈ కార్గో షిప్ మాత్రం వాతావరణ పరిస్థితుల్ని లెక్క చేయకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే.. ఆదివారం తెల్లవారుజామున లెస్‌బోస్‌కు నైరుతి దిశలో 4.5 నాటికల్ మైళ్లు (8.3 కిలోమీటర్లు) దిగువకు ఈ కార్గో షిప్ పడిపోయింది. దీంతో.. అందులోని 14 మంది సిబ్బంది గల్లంతయ్యారు.

ఈ కార్గో షిప్ మునిగిన విషయం తెలిసి.. ఐదు కార్గో షిప్‌లు, మూడు కోస్ట్ గార్డ్ నౌకలు, వైమానిక దళం, నేవీ హెలికాప్టర్‌లతో పాటు నేవీ ఫ్రిగేట్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇదిలావుండగా.. ఆలివర్ తుఫాను అడ్రియాటిక్ సముద్రం నుండి గ్రీస్ వైపు కదులుతున్నందున వాతావరణ శాఖ ‘పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని’ శనివారమే హెచ్చరికలు జారీ చేసింది. బహుశా ఈ హెచ్చరికల్ని సీరియస్‌గా తీసుకొని ఉంటే.. ఆ కార్గో షిప్ మునిగిపోకుండా సురక్షితంగా ఉండేది.

Tags

Read MoreRead Less
Next Story