బ్రెజిల్‌లో కరోనా కరాళనృత్యం

బ్రెజిల్‌లో కరోనా కరాళనృత్యం
బ్రెజిల్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ మరణమృదంగం మోగిస్తోంది.

బ్రెజిల్‌లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. తొలి విడతలోనూ ఈ దేశంలో కరోనా విరుచుకుపడింది. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ మరణమృదంగం మోగిస్తోంది. దేశంలో వైరస్‌ వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉంది. గడిచిన వారం రోజుల్లో ఆ దేశంలో రోజుకు సగటున 2 వేల 273 మంది మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆ దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య మూడు లక్షలు దాటింది. వైరస్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రెజిల్‌లో నమోదైన మరణాల మొత్తం 3 లక్షల 685కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజేలోనే రికార్డు స్థాయిలో 3 వేల 251 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం గత 75 రోజుల్లోనే లక్ష మంది కరోనా ధాటికి మృత్యువాత పడినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

రాజకీయంగా సమన్వయలేమి వల్లే దేశంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోగ్య నిపుణులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మరోవైపు, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో ఇటీవల సంక్షోభ కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా ఐదు లక్షలకు పైగా కరోనా మరణాలతో అమెరికా తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో బ్రెజిల్‌ ఉంది.

Tags

Read MoreRead Less
Next Story