వూహాన్‌ నగరంలో మళ్లీ పడగవిప్పిన కరోనా.. శరవేగంగా..

వూహాన్‌ నగరంలో మళ్లీ పడగవిప్పిన కరోనా..  శరవేగంగా..

Corona Cases file Photo

Corona Cases China: కరోనా పుట్టింట్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. కోటికి పైగా జనాభా ఉన్న వూహాన్‌ నగరంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.

కరోనా పుట్టింట్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. కోటికి పైగా జనాభా ఉన్న వూహాన్‌ నగరంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్క రోజే 61 కేసులు నమోదయ్యాయి. అసలే అది డెల్టా వేరియంట్ కావడంతో చైనా ప్రజలు వణికిపోతున్నారు. చైనా ప్రభుత్వం కూడా అప్రమత్తమై కరోనా టెస్టుల సంఖ్య పెంచింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వీలైనంత వరకు ఉపయోగించొద్దని ఆదేశాలు జారీ చేసింది. వైరస్ సోకిన వారిని, వారితో తిరిగిన వారిని ఐసోలేషన్‌లో పెడుతోంది. వూహాన్‌లో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని అధికారులు సైతం అంగీకరించారు. ఇది డేంజరస్‌ వేరియంట్‌ కావడంతో ప్రాథమిక స్థాయిలోనే వైరస్ బాధితులను గుర్తించేందుకు వూహాన్‌ అధికారులు కష్టపడుతున్నారు.

వూహాన్‌తో పాటు బీజింగ్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ మాటకొస్తే చైనా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాపించే గుణం ఉంది. పైగా చైనాలో జనాభా ఎక్కువ కావడం, వ్యాక్సిన్‌ వేయించుకున్నామన్న ధీమా ఉండడంతో.. అసలుకే ఎసరు పడింది. వ్యాక్సిన్ వేయించుకున్నా సరే డెల్టా వైరస్‌ ప్రతాపం చూపుతోంది. పైగా చైనా వ్యాక్సిన్‌పై ఇప్పటికే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చైనా తయారుచేసిన టీకాల సమర్థత ఎంత అన్నది తెలీదు. అయినప్పటికీ, అక్కడి ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి టీకాలు వేసుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నామన్న ధీమాతో అజాగ్రత్తగా ఉండడంతో చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వైరాలజీ ల్యాబ్ ఉన్న వూహాన్‌కు సైతం చేరింది.

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పుట్టినిల్లు వూహాన్‌లోని వైరాలజీ ల్యబ్. ఈ ల్యాబ్‌ లీక్ వల్లే కరోనా బయటికొచ్చిందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ దేశాలు సైతం చైనానే అనుమానిస్తున్నాయి. చైనా మాత్రం దీన్ని ఖండిస్తూ వస్తోంది. ప్రస్తుతం వూహాన్ ల్యాబ్‌ లీక్‌పై విచారణ జరుగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే.. కరోనా వైరస్‌ చైనాకే భస్మారుస హస్తంగా మారుతోంది. ఎక్కడి నుంచి కరోనా వైరస్ పుట్టుకొచ్చిందో.. అక్కడే మరోసారి వైరస్ విజృంభిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story