చేతిలో చిల్లిగవ్వ లేదు.. అందుకే కట్టుబట్టలతో పారిపోయా : అశ్రఫ్ ఘనీ

ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ(72) డబ్బులతో పారిపోయారని ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలో తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియోను విడుదల చేశారయన.. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఆఫ్గనిస్తాన్ లో రక్తపాతాన్ని నివారించేందుకు దేశాన్ని విడిచి వెళ్ళిపోయానని అన్నారు. ఒకవేళ అక్కడే ఉంటే.. కొత్త అధ్యక్షుడి కళ్ల ముందే తనను ఉరితీసేవారని వాపోయారు. ఇక హెలికాప్టర్ నిండా డబ్బులతో పారిపోయారన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కేవలం అవి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. కట్టుబట్టలు, చెప్పులతో తాను అఫ్గన్ విడిచి వచ్చానని, కనీసం షూస్ వేసుకునే సమయం కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ సందర్భంగా అఫ్గన్ భద్రతాదళాలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆఫ్గనిస్తాన్ 14వ అధ్యక్షుడిగా అశ్రఫ్ ఘనీ 2014లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఘనీ యూఏఈలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com