Photo Shoot: ఫొటోషూట్‌లో కలర్ బాంబ్ పేలి ఆసుపత్రి పాలైన వధువు

Photo Shoot: ఫొటోషూట్‌లో కలర్ బాంబ్ పేలి ఆసుపత్రి పాలైన వధువు
X

ఫొటోషూట్ లో జరిగిన ఒక ఘటనలో తృటిలో వధువుకు ముప్పు తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత సంతతి చెందిన జంట కెనడాలో ఉంటున్నారు. అయితే వివాహ వేడుక కోసం భారత్‌కు వచ్చారు. అయితే పెళ్లి-రిసెప్షన్‌కు ముందు జంట ఫొటోషూట్ ఏర్పాటు చేశారు. నవ వధూవరులిద్దరూ ఆనందంగా.. సంతోషంగా ఫొటోలు.. వీడియోలు దిగుతున్నారు. ఉన్నట్టుండి ఏమి ఆలోచన వచ్చిందో.. ఏమో తెలియదు గానీ.. కొంచెం భిన్నంగా ఉండాలని అనుకున్నారేమో తెలియదు గానీ.. కలర్ బాంబులను ఏర్పాటు చేశారు. ఫొటోషూట్ కోసం వరుడు.. వధువును పైకి లేపాడు. ఆ సమయంలో ఒక్కసారిగా కలర్ బాంబ్ పేలి వధువును వేగంగా ఢీకొట్టింది. అంతే ఒక్కసారిగా ఆమె విలవిలలాడిపోయింది. ఆమె జుట్టు కాలిపోవడమే కాకుండా.. నడుం దగ్గర తీవ్రగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

పెళ్లిళ్లలో బాణాసంచా పేల్చడం సహజమే. అయితే ఏది చేసినా శృతిమించకూడదు. లేదంటే లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. జంట వీడియో పోస్ట్ చేసి.. తమలా ఎవరూ చేయొద్దని.. ఒకవేళ ఫొటోషూట్‌లు చేసుకున్నా జాగ్రత్తలు తీసుకోవాలని జంట విక్కీ, ప్రియా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను 22 మిలియన్లు వీక్షించారు. ఆమె వెంటనే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని యథావిధిగా పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఇక వీడియోను వీక్షించిన నెటిజన్లు.. వధువు పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని వివాహ బంధాన్ని ఆస్వాదించాలని కోరారు.

Tags

Next Story