Covid New Variant: కొత్త రూపంలో కరోనా.. మునుపటికంటే ప్రమాదకరంగా..

Covid New Variant (tv5news.in)

Covid New Variant (tv5news.in)

Covid New Variant: కరోనా ముప్పు ఇంకా తప్పలేదా? మరో రూపంలో కరోనా టెర్రర్‌ పుట్టించనుందా?

Covid New Variant: కరోనా ముప్పు ఇంకా తప్పలేదా? మరో రూపంలో కరోనా టెర్రర్‌ పుట్టించనుందా? అంటే అవునంటున్నారు శాస్త్రవేత్తలు. సౌతాఫ్రికాలో కనుగొన్న కొత్త వేరియంట్‌ సైంటిస్ట్‌లకు సైతం చెమటలు పట్టిస్తోంది.

కరోనా టెర్రర్‌ నుంచి కొద్దిగా కోలుకుని బతుకుజీవుడా అనుకుంటున్న ప్రపంచానికి మరో వార్త గుబులు పుట్టిస్తోంది. వ్యాక్సిన్‌ వేసుకున్నాం.. కేసులు కూడా తగ్గాయి అనుకుని ఊపిరి పీల్చుకుంటున్న జనానికి.. ఐ యామ్‌ బ్యాక్‌ అంటూ వస్తున్న కొత్త వేరియంట్ మరో సవాల్‌ విసురుతోంది. సౌతాఫ్రికాలో తాజాగా కనుగొన్న కరోనా కొత్త వేరియంట్‌ B.1.1.529 సైంటిస్ట్‌లను సైతం ఆందోళనలోకి నెట్టేసింది.

అసలు ఎందుకు ఈ వేరియంట్‌ కొత్త టెన్షన్‌ పెడుతోంది? మిగతా వేరియంట్స్‌కి ఈ B.1.1.529 వేరియంట్‌కి ఉన్న తేడా ఏంటి? అంటే ఈ వేరియంట్‌ స్టామినా తెలుసుకోవాల్సిందే. సౌతాఫ్రికాలో కనుగొన్న ఈ B.1.1.529 వేరియంట్‌ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 స్పైక్‌ మ్యూటేషన్స్‌ చెందింది. ఇన్ని మ్యూటేషన్స్‌ చెందిన ఈ వేరియంట్‌ మనిషి ఇమ్యునిటీని ఈజీగా బ్రేక్‌ చేస్తోంది అంట. దీనిపై ఇప్పటికే అలర్ట్‌ అయిన లండన్‌ వైరాలజీ డిపార్ట్‌మెంట్‌ ఎక్కువ మ్యూటేషన్స్‌ చెందిన ఈ వేరియంట్‌తో చాలా డేంజర్‌ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ B.1.1.529 వేరియంట్‌ను నవంబర్‌ 11న సౌతాఫ్రికాలోని బోల్స్‌వానాలో తొలిసారి కనుగొన్నారు. ఈ కేసు నమోదైన మూడు రోజుల తర్వాత మరో వ్యక్తిలో ఇదే వేరియంట్‌ని కనుగొన్నారు. సౌతాఫ్రికా తర్వాత ఈ వేరియంట్‌ని హాంకాంగ్‌లో 36ఏళ్ల వ్యక్తిలో గుర్తించారు. ఈ B.1.1.529 వేరియంట్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన N679K, N501Y లాంటి మ్యూటేషన్స్‌ని కూడా కలిగి ఉండటం ఇప్పుడు శాస్త్రవేత్తలను కంగారుపెడుతోంది.

Tags

Next Story