విమానంలో వింత చేష్టలు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని...

విమానంలో వింత చేష్టలు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని...
ఫిలిప్పీన్స్‌లోని సిబూ నుంచి దక్షిణ కొరియాలోని సియోల్‌కు వెళ్లే రెడ్-ఐ విమానంలో 19 ఏళ్ల యువకుడి హల్‌చల్‌

ఫిలిప్పీన్స్‌లోని సిబూ నుంచి దక్షిణ కొరియాలోని సియోల్‌కు వెళ్లే రెడ్-ఐ విమానంలో 19 ఏళ్ల యువకుడు హల్‌చల్‌ చేశాడు. దాదాపు 1 గంట సేపు విమానంలో వింతగా ప్రవర్తించాడు. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా అత్యవసర ద్వారం వద్దకు వెళ్లి దానిని తెరవడానికి ప్రయత్నించాడు. దీంతో మిగతా ప్రయాణికులంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఏం జరుగుతుందోనని బిక్కు బిక్కున గడిపారు.

వివారాళ్లోకి వెళితే.. సౌత్‌ కొరియాకు చెందిన యువకుడు ఫిలిప్పీన్స్‌లోని సిబూ నుంచి దక్షిణ కొరియాలోని సియోల్‌కు వెళ్లే రెడ్-ఐ విమానంలో ప్రయాణిస్తున్నాడు. అంతలో ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఎమర్జెన్సీ డోర్‌ వద్దకు పరుగున వెళ్లి దానిని తెరవబోయాడు. వెంటనే క్యాబిన్‌ క్రూ అతనిని అడ్దుకొని అదుపులోకి తీసుకోవడానికి తీవ్రంగానే శ్రమించారు. అయితే ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయానికులు ఉన్నారు. ఈ తతంగమంతా దాదాపు గంటకు పైనే జరిగిందని జీజు ఎయిర్‌లైన్స్‌ అధికారులు వెల్లడించారు.

అతను ఎంతకు వినకపోవడంతో గట్టిగా పట్టుకొని క్రూ ముందు ఉండే సిట్లో కదలకుండా కట్టేసి కూర్చోబెట్టారు. మరుసటి రోజు సోమవారం (జూన్‌,19)న విమానం ల్యాండ్‌ అయ్యాక సదరు యువకున్ని పోలీసులకు అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే విమానంలో ఉన్న మిగతా ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ సంఘటనకు పాల్పడటానికి గల కారణాలపై విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story