అంతర్జాతీయం

Hong Kong: కొడుకు చేతిలో బొమ్మ విరిగింది.. దుకాణదారుడికి రూ.3 లక్షలు కట్టిన తండ్రి..

Hong Kong: పిల్లలే కాదు.. పెద్దలు వెళ్లినా ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి.. దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది..

Hong Kong: కొడుకు చేతిలో బొమ్మ విరిగింది.. దుకాణదారుడికి రూ.3 లక్షలు కట్టిన తండ్రి..
X

Hong Kong: పిల్లలే కాదు.. పెద్దలు వెళ్లినా ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి.. దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.. ఖరీదైన టాయ్ షాప్.. నాన్నకి కాల్ వచ్చింది.. బయటకు వెళ్లాడు.. బుజ్జిగాడి చేయి తగిలి బొమ్మ పగిలింది.. ఆ సౌండ్ కి పాపం వాడు అదిరిపోయాడు.. నాన్నేమో దాని ఖరీదు చెల్లించమనేసరికి బేజారయ్యాడు.. అయినా దుకాణదారుడు అడిగిన మొత్తం కట్టక తప్పలేదు..

కొడుకు టెలీటబ్బీ బొమ్మ పగలగొట్టడంతో బొమ్మల దుకాణానికి రూ. 3 లక్షల 30వేలు చెల్లించాడు తండ్రి. హాంకాంగ్‌లోని మోంకాక్ జిల్లాలో లాంగ్‌హామ్ ప్లేస్ షాపింగ్ మాల్‌లోని బొమ్మల దుకాణంలో ఈ ఘటన జరిగింది. టెలిటబ్బీ అనేది 90ల చివరలో బ్రిటీష్ పిల్లల TV సిరీస్. BBC షో యొక్క విభిన్న రంగుల పాత్రలను టెలిటబ్బీస్ అని పిలుస్తారు.

హాంగ్‌కాంగ్‌లో ఒక వ్యక్తి తన కుమారుడు పొరపాటున పగలగొట్టిన టెలీటబ్బీ బొమ్మకి భారీ ముల్యం చెల్లించాల్సి వచ్చింది. బాలుడి తండ్రి చెంగ్ కు ఫోన్ కాల్ రావడంతో షాపు నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈలోపు బొమ్మల దుకాణం లోపల పెద్ద శబ్ధం వినిపించింది తండ్రికి. అతను లోపలికి వెళ్ళాడు, తన కొడుకు 'కదలకుండా' నిలబడి, విరిగిన టెలీటబ్బీ బొమ్మ రూపాన్ని చూస్తూ ఉన్నాడు.

"ఈ సంఘటన తర్వాత నా కొడుకు చాలా భయపడ్డాడు, అతను పాఠశాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. ఆ బొమ్మ ఎందుకు అంత భయంకరంగా ఉందని అతను నన్ను తరచు అడుగుతూనే ఉన్నాడు.

ధర చెల్లించడానికి తండ్రి అంగీకరించినప్పటికీ, తమ కొడుకు ఉద్దేశపూర్వకంగానే బొమ్మను పగలగొట్టాడని ఉద్యోగులు ఆరోపించారు. తనను, తన భార్యను తప్పుదారి పట్టించారని అతను పేర్కొన్నాడు. బాలుడు బొమ్మను తన్ని నేలపై పడవేసినట్లు ఉద్యోగులు తెలిపారు. అయితే, తన కొడుకు బొమ్మకు ఆనుకుని ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని, ప్రమాదవశాత్తూ అది పడిపోయిందని చెంగ్ చెప్పారు.

బొమ్మను పడిపోకుండా పట్టుకునే ప్రయత్నం చేశాడు అది కూడా ఫుటేజీలో కనిపిస్తోంది కదా అని షాపు యజమానితో ఆర్గ్యూ చేసినా వినిపించుకోలేదు. బొమ్మ పడిపోయే ప్రమాదం ఉంటే దానిని మరింత భద్రంగా ఉంచవలసిన బాధ్యత దుకాణదారుడిది అని చెంగ్ అన్నారు. దీనిని ఎవరూ తాకరాదు అని కూడా లేబుల్ అంటించాలని అన్నారు. ఏది ఏమైనా నష్టపరిహారం భారీగా చెల్లించవలసి వచ్చిందని బాధపడ్డాడు.

Next Story

RELATED STORIES