భారతీయ విద్యార్థిపై కత్తిపోటు.. విచారం వ్యక్తం చేసిన అమెరికా విదేశాంగ శాఖ

భారతీయ విద్యార్థిపై కత్తిపోటు.. విచారం వ్యక్తం చేసిన అమెరికా విదేశాంగ శాఖ
X
అమెరికాలోని ఇండియానాలో భారతీయ విద్యార్థిపై దాడి జరగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉంది.

అమెరికాలోని ఇండియానాలో భారతీయ విద్యార్థిపై దాడి జరగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉంది. అయితే దాడిపై స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది. ఇండియానాలోని జిమ్‌లో కత్తిపోట్లకు గురైన భారతీయ విద్యార్థి వరుణ్ రాజ్ పుచ్చా త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేసింది.

US స్టేట్ డిపార్ట్‌మెంట్ కూడా కల్పించుకుని కేసు గురించి అడిగి తెలుసుకుంది. "భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థి వరుణ్ రాజ్ పుచ్చాపై జరిగిన క్రూరమైన దాడికి సంబంధించిన నివేదికలు మమ్మల్ని ఎంతగానో కలచి వేశాయి. అతడు గాయాల నుండి పూర్తిగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము అని US స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

వరుణ్ అనే కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని ఆదివారం ఉదయం పబ్లిక్ జిమ్‌లోకి ప్రవేశించిన జోర్డాన్ ఆండ్రేడ్ (24) అనే దుండగుడు కత్తితో దాడి చేసి అతడిని తీవ్రంగా పొడిచాడు. ఈ హఠాత్ పరిణామంతో కలత చెందిన జిమ్ యజమాని వరుణ్ ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

గాయాలు తీవ్రంగా ఉన్నాయని, అతడు కోలుకునేందుకు చాలా సమయం పట్టవచ్చని వైద్యులు వివరించారు. ప్రస్తుతం అతడు లైఫ్ సపోర్టులో కొనసాగుతున్నాడు. తీవ్రమైన నరాల బలహీనతను కలిగి ఉన్నాడు అని వైద్యులు తెలిపారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో వరుణ్‌ని ఇప్పుడు ఫోర్ట్ వేన్‌లోని లూథరన్ ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటన తరువాత, దాడి చేసిన జోర్డాన్ ఆండ్రేడ్ ను అరెస్టు చేశారు. వాల్‌పరైసో యూనివర్సిటీ ప్రెసిడెంట్ తన విద్యార్థి అయాన వరుణ్ పై జరిగిన క్రూరమైన దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

“వరుణ్ రాజ్ పుచ్చాపై జరిగిన దాడి మమ్మల్ని తీవ్రంగా కలచి వేసింది. Valparaiso విశ్వవిద్యాలయంలో, మేము ఒకరినొకరు కుటుంబంగా పరిగణించుకుంటాము. ఈ సంఘటన భయానకంగా ఉంది. మా ఆలోచనలు, ప్రార్థనలు అన్నీ అతడి కుటుంబ సభ్యుల గురించి, ”అని యూనివర్సిటీ ప్రెసిడెంట్ జోస్ పాడిల్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

"యూనివర్సిటీ మరియు వాల్పో కమ్యూనిటీ వరుణ్ కుటుంబం వీలైనంత త్వరగా యునైటెడ్ స్టేట్స్‌కు చేరుకోవడంలో సహాయం చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తున్నాయి" అని ఆయన తెలిపారు. వాల్‌పరైసో యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ద్వారా కొనసాగుతున్న విచారణకు పూర్తి మద్దతును కూడా అందిస్తోంది.

Tags

Next Story