అమెరికా చరిత్రలో సెనెటర్‌గా ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌..

అమెరికా చరిత్రలో సెనెటర్‌గా ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌..

అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి తొలి అడుగు పడింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఓ ట్రాన్స్‌జెండర్.. ఘన విజయాన్ని సాధించారు. డెల్వర్ స్టేట్ సెనెటర్‌గా ఎన్నికయ్యారు. ఆమె పేరు సారా మెక్‌బ్రైడ్. ఓ ట్రాన్స్‌జెండర్.. సెనెట్‌కు ఎంపిక కావడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రాజకీయాల్లో ఓ ట్రాన్స్‌జెండర్ సెనెటర్ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. ట్రాన్స్‌జెండర్లకు సమానత్వ చట్టాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చిన డెమొక్రాట్ల తరఫున ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.

లెస్బియన్లు, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్లు, గే హక్కు హక్కుల కోసం కొంతకాలంగా మెక్‌బ్రైడ్‌ ఉద్యమిస్తున్నారు. LGBTQ సమస్యలను పరిష్కరించడానికి శ్రమిస్తున్నారు. ఈక్వాలిటీ యాక్ట్‌ కోసం.. సారా మెక్‌బ్రైడ్ అనేక ఉద్యమాలను నిర్వహించారు. తోటి పౌరుల్లాగే.. తమకూ సమాన హక్కులు కల్పించాలనే అంశం మీద LGBTQ అసోసియేషన్లతో కలిసి పని చేస్తున్నారు. ఇదివరకు హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్‌ అమెరికా విభాగానికి జాతీయ ప్రెస్ సెక్రెటరీగా సారా వ్యవహరించారు.

30 ఏళ్ల సారా డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేశారు. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి స్టీవ్ వాషింగ్టన్‌ను ఓడించి భారీ మెజారిటీ సాధించారు. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ ద్వారా ఓటర్లకు కృతజ్ఙతలు తెలిపారు. ట్రాన్స్‌ జెండర్‌ అయిన తాను... సాధారణ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించాం.. అంటూ ట్వీట్ చేశారు. తన తొలి లక్ష్యం.. ట్రాన్స్‌జెండర్లకు సమాన హక్కులను కల్పించడానికి ఉద్దేశించిన ఈక్వాలిటీ బిల్‌ను సాధించడమేనని.. గెలుపు సందర్భంగా అన్నారు.

సారా మెక్‌బ్రైడ్‌కు డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరురాలిగా గుర్తింపు ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఆమె ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2016 ఎన్నికల సందర్భంగా డెమొక్రటిక్ పార్టీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ఎన్నికల్లో డెమొక్రాట్లు ఓడిపోయారు. రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మారిన తరువాత.. పూర్తిస్థాయిలో తన కార్యకలాపాలను LGBTQ కోసం కేటాయించారు. ఆ తర్వాత.. ఇప్పుడు డెల్వర్ స్టేట్ సెనెటర్‌గా ఎన్నికై ప్రపంచ దృష్టిని ఆకర్షించారు సారా మెక్ బ్రైడ్‌.

Tags

Read MoreRead Less
Next Story