Delhi : ఎయిర్ ఇండియా విమానంలో.. మహిళ పై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్

Delhi : ఎయిర్ ఇండియా విమానంలో.. మహిళ పై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్
ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్‌ చేసిన ఢిల్లీ పోలీసులు; పోలీసుల అదుపులో నిందితుడు.. శిక్ష తప్పదు; చర్యలు తీసుకుంటాం- ఎయిర్‌ ఇండియా విమాన సీఈఓ

న్యూయార్క్- ఢిల్లీ విమానంలో తాగిన మత్తులో వృద్ధురాలి పై మూత్రవిసర్జన చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలం సృష్టించింది. ఈ ఘటన పై బాధిత మహిళ రాసిన లేఖ వైరల్ అవ్వాగా దీనిపై విచారణ చేపట్టిన ఎయిర్ ఇండియా పోలీసుల సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు.

ఘటన జరిగిన అనంతరం నిందితుడు శంకర్ మిశ్రా పరారీలో ఉన్నాడు. జనవరి 3న అతను తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగా, అతని చివరి లొకేషన్ ను పోలీసులు బెంగుళూరులో గుర్తించారు. అక్కడే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు పై విచారణను వేగవంతం చేశారు. విచారణలో భాగంగా పైలట్ల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడిపై ఎయిర్‌లైన్ చర్యలు తీసుకుంది. తదుపరి 30 రోజుల పాటు నిందితుడు ఎయిర్ లైన్స్ లో ప్రయాణించకుండా నిషేధించింది.


ఇక అన్నివైపుల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలతో దిగి వచ్చిన ఎయిరిండియా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. విమానాల్లో ప్రయాణికులు అనుచిత ప్రవర్తనకు పాల్పడితే, ఆ విషయాన్ని నిర్భయంగా అధికారులకు తెలపాలని సంస్థ సీఈవో క్యాంబెల్ విల్సన్ స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story