Denmark: డెన్మార్క్ లో పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం

పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ సభ్య దేశం డెన్మార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తున్నది.
దీని ప్రకారం, తల్లిదండ్రుల అనుమతితో 13 ఏండ్లు దాటిన పిల్లలు సోషల్ మీడియా వాడకానికి కొన్ని షరతులతో అనుమతి ఇస్తున్నట్టు తెలిసింది. ఆన్‌లైన్‌లో విపరీతమైన హింస, స్వీయ హానికి పురిగొల్పే ప్రమాదకర కంటెంట్‌కు పిల్లల్ని దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ డిజిటల్ అఫైర్స్ మంత్రి కరోలినా తెలిపారు.
సోషల్ మీడియా పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. నిద్రకు అంతరాయం కలుగుతుందని, ఏకాగ్రత కోల్పోతున్నారని తెలిపింది. ఆన్‌లైన్ మోసాలకు పిల్లలు బలైపోతున్నారని అధికారులు వెల్లడించారు.. డిజిటలైజేషన్ మంత్రి మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా పిల్లల బాల్యాన్ని, వారి సమయాన్ని, వారి ఆనందాన్ని దోచుకుంటోందని, దానికి తాము ముగింపు పలుకుతున్నామని ప్రకటించారు. ఆన్‌లైన్ ప్రపంచంలో హానికరమైన కంటెంట్, వాణిజ్య ప్రభావాలు తీవ్రమైపోయాయని, వాటి నుండి యువతను రక్షించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం విదుదల చేసిన కొత్త మార్గదర్శకాల్లో యుట్యూబ్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి దిగ్గజ సంస్థలపై నియంత్రణలు ఉన్నాయి. అయితే 13 సంవత్సరాలు దాటిన వారికి తల్లిదండ్రుల సమక్షంలో అనుమతించనున్నారు. అదీ పరిమిత కాలం వరకే. కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలీయా ఇటువంటి నిర్ణయాన్నే తీసుకుంది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో సోషల్ మీడియాను వయోపరిమితి ఆధారంగా నియంత్రించిన మొదటి దేశంగా డెన్మార్క్ నిలిచింది. ఈ నిర్ణయంతో పిల్లల్లో మానసిక ఆరోగ్యం, వారి అభివృద్ధికి, విచ్చలవిడాగా పెరిగిపోతున్న సోషల్ మీడియా నియంత్రణకు దోహదపడుతుందని పలువురు భావిస్తున్నారు…
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

