ఆలయానికి విచ్చేసిన బైడెన్.. తిలకం దిద్దిన పూజారి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష రేసులో జో బైడెన్ ఉండడం హర్షనీయమని వేద పండితులు బ్రహ్మశ్రీ కశోఝుల చంద్రశేఖరవర్మ పేర్కొన్నారు.. అమెరికాలో హిందూ సంస్కృతి, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి అయిన ఆయన అన్నారు. వర్మ రెండు దశాబ్దాల క్రితమే యజుర్వేదం అధ్యయనం చేసి అమెరికాలోని డబ్లిన్ సిటీలో పూజారిగా స్థిరపడ్డారు..
గురువారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన 2003 మే నెలలో విలివింట్ సిటీలో ఉన్న మహాలక్ష్మీ ఆలయంలో నిర్వహించిన కుంభాభిషేక కార్యక్రమానికి సెనెట్‌గా బైడెన్ హాజరయ్యారని తెలిపారు.. ఈ సందర్భంగా బైడెన్‌కు తానే స్వయంగా తిలకం దిద్ది, ఆయన పేరు మీద ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల బైడెన్‌కు అమితమైన గౌరవం ఉందని, హిందూ సంప్రదాయాలు, వేదాలు, పురాణాలపై ఆసక్తి కనబరిచే వారని వర్మ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com