Diabetes: ముందు గుర్తిస్తే ముప్పు తగ్గచ్చు

Diabetes: ముందు గుర్తిస్తే ముప్పు తగ్గచ్చు
ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మందికి డయాబెటిస్‌

తియ్యగా మాట్లాడితే పర్లేదు కానీ ఆ తియ్యని వ్యాధి వస్తే మాత్రం తగ్గేదే లేదు..పేరులో మధురాన్ని పెట్టుకొని కూడా మనల్ని ఇబ్బందులు పెట్టే వ్యాధే మధుమేహం. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మందికిపైగా డయాబెటిస్‌ బారిన పడే ప్రమాదమున్నదని లాన్సెట్‌ అధ్యయనం హెచ్చరించింది. ఈ హెచ్చరికతో అందరి ద్రుష్టి ఇప్పుడు మరోసారి డయాబెటిస్‌ మీద పడింది.

ఈ అధ్యయనం ప్రకారం..ప్రపంచంలో డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. అందులోనూ టైప్‌-2 డయాబెటిస్‌ వారి సంఖ్యే ఎక్కువ. మధుమేహం మరిన్ని వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తాజా అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకున్నది.

ఎందుకంటే వీరికి మధుమేహులకు గుండెజబ్బులు, ఫుట్‌ అల్సర్‌, హార్ట్ స్ట్రోక్‌, కంటిచూపు కోల్పోవడం వంటి ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు సరైన అవగాహన, చికిత్స లేకపోవడం వల్ల అనేక మంది ఈ వ్యాధులకు గురవుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, వయసు, ఒబెసిటీ తదితర కారణాల వల్ల మధుమేహం బారిన పడుతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. మితిమీరిన రిఫైన్డ్‌ కార్బోహైడ్రేట్‌, ఆహారం, డ్రింక్స్‌లో షుగర్‌ ఎక్కువగా తీసుకోవడం, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వంటివి అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహ ముప్పును పెరుగుతుందని వైద్యులు వెల్లడించారు.

మధుమేహం ప్రమాదాన్ని పెంచేవి సాధారణంగా వయస్సు, ఊబకాయం. ఎక్కువ బీఎంఐకి అధిక–క్యాలరీ ఉత్పత్తులు, అల్ట్రా–ప్రాసెస్డ్‌ ఆహారం, కొవ్వు, చక్కెర, జంతు ఉత్పత్తుల వినియోగం. వీటితోపాటు తగ్గిన శారీరక శ్రమ డయాబెటిస్‌కు కారణం అవుతోంది . జన్యు సంబంధమైన కారణాలతోపాటు అనారోగ్యకర జీవన శైలితో కూడా మధుమేహం బారినపడే ప్రమాదముంది. అయితే ప్రీడయాబెటిస్‌ను ముందే గుర్తిస్తే వ్యాధి ముప్పు బారిన పడకుండా చూడొచ్చని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story