Disney: ఫ్రోజెన్ కు మరో సీక్వెల్ వచ్చేస్తోంది...

Disney: ఫ్రోజెన్ కు మరో సీక్వెల్ వచ్చేస్తోంది...
టాయ్ స్టోరీ, ఫ్రోజెన్ సినిమాకు తదుపరి సీక్వెళ్లు; డిస్నీ సీఈఓ బాబ్ వెల్లడి

చిన్నారి ప్రేక్షకులు, ఫ్రోజెన్ అభిమానులకు డిస్నీ గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్న యానిమేటెడ్ మూవీ ఫ్రోజెన్ రెండు భాగాలకూ విపరీతమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. 2013లో వచ్చిన ఫ్రోజెన్ భారీ విజయం నమోదు చేసుకోగా దానికి సీక్వెల్ గా 2019లో వచ్చిన ఫ్రోజన్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 140కోట్ల కలెక్షన్లు రాబట్టంది. దీంతో ఫ్రోజన్ 3 అనౌన్స్మెంట్ అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు డిస్నీలో వరుస లేఆఫ్ లు, నష్టాలు చోటుచేసుకుంటున్నప్పటికీ సీఈఓ బాబ్ మరిన్ని ఫ్రాంచైజ్ లను ప్రకటించి ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురిచేశారు. ఫ్రోజెన్ తో పాటూ టాయ్ స్టోరీ, పాండోరా కు కూడా తదపరి సిరీస్ ను తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించారు.



Tags

Read MoreRead Less
Next Story