21 Oct 2020 9:59 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / భరించలేని తలనొప్పి.....

భరించలేని తలనొప్పి.. మెదడులో 700 పురుగులు.. ఉడకని మాంసం తినడంతో..

భరించలేని తలనొప్పి.. తట్టుకోలేక వైద్యుల దగ్గరకు వెళితే సాధారణ తలనొప్పేగానే భావించి..

భరించలేని తలనొప్పి.. మెదడులో 700 పురుగులు.. ఉడకని మాంసం తినడంతో..
X

మెదడులో ఏదైనా పురుగు తొలుస్తోందా గంటకో ఆలోచన చేస్తావని.. మాట మీద నిలకడలేని వ్యక్తులను తరచూ అంటూ ఉంటారు.. అతడికి వచ్చింది ఆలోచనలు కాదు.. భరించలేని తలనొప్పి.. తట్టుకోలేక వైద్యుల దగ్గరకు వెళితే సాధారణ తలనొప్పేగానే భావించి మందులిచ్చి పంపించారు. అయినా తగ్గట్లేదు. లాభం లేదని పెద్దాసుపత్రికి వెళ్లాడు.. అక్కడి వైద్యులు అతడి మెదడును స్కాన్ చేశారు. రిపోర్టులు చూసి వైద్యులు షాకయ్యారు. మెదడులో వందల సంఖ్యలో టేప్‌వార్మ్స్ (రిబ్బన్ తరహాలో పొడవుగా పాముల్లా ఉండే పురుగులు) కనిపించాయి. మెదడుతో పాటు బాడీలో ఎక్ఉకడైనా ఉన్నాయేమోనని మొత్తం స్కాన్ చేశారు. ఛాతి, ఊపిరితిత్తుల్లో కూడా టేప్‌వార్మ్స్ కనిపించాయి. అవి అతడి శరీరంలోని అవయవాలను చుట్టేసినట్లు కనిపించాయి.

ఏ జంతువునీ వదలకుండా తినే చైనాలోనే ఈ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి జెజియాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఓ వ్యక్తికి వచ్చిన తలనొప్పి సమస్యను టైనియాసిస్ అంటారని వైద్యులు తెలిపారు. టేప్ వార్మ్ వంటి పరాన్న జీవులు శరీర అవయవాల్లోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి సోకుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌‌ విభాగానికి చెందిన వైద్యుడు డాక్టర్ వాంగ్ జియాన్ రాంగ్ వెల్లడించారు. అన్ని పురుగులు అతడి అవయవాల్లో ఉండడం చూసి వైద్యులు విస్తుపోయారు.

ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి అని నిర్ధారించి తక్షణ చికిత్సను ప్రారంభించారు. బాధితుడి ఆహారపు అలవాట్ల గురించి అడగ్గా నెల రోజుల క్రితం పూర్తిగా ఉడకని పంది మాంసం తిన్నానని చెప్పాడు. దాంతో ఆ మాంసం ద్వారానే పరాన్నజీవులు అతడి శరీరంలో చేరి ఉంటాయని వైద్యులు తెలిపారు. పంది శరీరంలో ఉన్న టేప్‌వార్మ్ గుడ్లు బతికే ఉండడంతో దాన్ని తిన్న వ్యక్తి శరీరంలోకి వెళ్లి అవి విస్తరించాయని వైద్యులు తెలిపారు. టేప్‌వార్మ్ పురుగులు పంది మాంసంలోనే ఎక్కువగా ఉంటాయని అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. టేప్‌వార్మ్ వంటి పురుగులు ఉడకని మాంసంలో ఎక్కువగా ఉంటాయని దాన్ని తినడం ద్వారా వాటి అండాలు కేంద్ర నాడీ వ్యవస్థలోకి చేరుకుంటాయి. దీని కారణంగా నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. తీవ్రమైన జ్వరం, తలనొప్పి వంటి వ్యాధులకు మూల కారణం పరిశీలిస్తే తీసుకుంటున్న ఆహారం ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక మాంసాహారులు బాగా ఉడికించిన మాంసాన్ని మాత్రమే తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Next Story