Mysterious illness: అమెరికా శునకాలకు అంతుచిక్కని వ్యాధి 200పైగా కేసులు

Mysterious illness: అమెరికా శునకాలకు అంతుచిక్కని వ్యాధి 200పైగా కేసులు
పశువైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు..

ప్రపంచ దేశాల్లో నలుమూలల ఏదో ఒక జీవికి వింత వ్యాధులు సోకుతూ ఉంటాయి. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో ఇలాంటి కొత్త వ్యాధి వ్యాప్తి చెందుతోంది. అయితే మనుషులకు కాకుండా కుక్కలకు ఈవ్యాధి సోకడం గమనార్హం. ఇప్పటికే దాదాపు వందల సంఖ్యలో కుక్కలు శ్వాసకోశ వ్యాధిబారిన పడ్డట్లు అధికారికంగా ప్రకటించారు. ఓరెగాన్ రాష్ట్రంలో ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ 200 కేసులు నమోదైనట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ వ్యాధి కుక్కల్లోనే ఎందుకు సోకుతుంతో ఎవరూ గుర్తించలేక పోతున్నారు. కొలరాడో, న్యూ హ్యాంప్ షైర్ రాష్ట్రాల్లో కూడా శునకాలు ఈ రోగాల బారిన పడ్డట్లు తెలుస్తోంది. రోడ్ ఐలాండ్, మసాచుసెట్స్ తోపాటూ ఇతర రాష్ట్రాల నుంచి కుక్కల శాంపిల్స్ తీసి న్యూ హ్యాంప్ షైర్ యూనివర్సిటీకి పంపుతున్నట్లు పశువైద్యులు డేవిడ్ నీడిల్ తెలిపారు.

దాదాపు సంవత్సర కాలంగా ఈవ్యాధి తమ దృష్టికి వస్తోందని వివరించారు వైద్యులు. ఈ వ్యాధి తీవ్రత పెరిగితే కుక్కలు మరణించే అవకాశం ఉందంటున్నారు. అయితే పెంపుడు కుక్కల యాజమానులు దీనిపై కొంత అవగాహన ఉంచుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఓరెగాన్‌ రాష్ట్రంలో ఆగస్టు నుంచి ఇప్పటివరకు 200 కేసులు వైద్యాధికారుల దృష్టికి వచ్చాయని తెలిపారు. ‘కొలరాడో, న్యూ హ్యాంప్‌షైర్‌ రాష్ట్రాల్లోనూ శునకాలు ఈ వ్యాధిబారిన పడ్డాయి. రోడ్‌ ఐలాండ్‌, మసాచుసెట్స్‌ తోపాటు ఇతర రాష్ట్రాల నుంచీ తమ పరిశీలనకు శాంపిళ్లు వస్తున్నాయి’ అని న్యూ హ్యాంప్‌షైర్‌ విశ్వవిద్యాలయంలో పశు వైద్య పరిశోధకుడు డేవిడ్‌ నీడిల్‌ చెప్పారు. ఏడాది కాలంగా ఈ వ్యాధి తమ దృష్టికి వస్తోందన్నారు.


దీనివల్ల శునకాలలో పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కానప్పటికీ, పెంపుడు కుక్కల యజమానులు జాగ్రత్త పడాలని సూచించారు. దగ్గు, తుమ్ములు, ముక్కువెంట, కళ్ల నుంచి నీరు కారడం, బద్ధకం ఈ వ్యాధి లక్షణాలు. యాంటీబయాటిక్స్‌ పనిచేయడం లేదు. ఈ రుగ్మతలకు కారణాలేమిటో శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు. సకాలంలో కుక్కలకు టీకాలు వేయించాలనీ, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే జంతు వైద్యుల వద్దకు వెళ్లాలని యజమానులకు అధికారులు సూచిస్తున్నారు. అలాగే చిన్న పిల్లలను కొంతకాలంపాటు కుక్కలకు దూరంగా ఉంచాలని, లేదంటూ ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా జనాలు కలవరపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story