Donald Trump: చైనా, అమెరికా మధ్య యుద్ధం ఖాయం: డొనాల్డ్ ట్రంప్

Donald Trump: చైనా, అమెరికా మధ్య యుద్ధం ఖాయం: డొనాల్డ్ ట్రంప్
Donald Trump: ఓవైపు తైవాన్‌ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల దూకుడు పెరుగుతున్న వేళ డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు

Donald Trump: ఓవైపు తైవాన్‌ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల దూకుడు పెరుగుతున్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరకు చైనాతో అగ్రరాజ్యం యుద్ధం చేసేలా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికాలోని ప్రస్తుత బలహీన, అవినీతి ప్రభుత్వాన్ని చైనా ఏమాత్రం గౌరవించడం లేదని అన్నారు. త్వరలో చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్నారన్న వార్తల నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖలు చేయడం విశేషం.

అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని మరోసారి ట్రంప్‌ ఆరోపించారు. అవినీతి ప్రభుత్వం దేశాన్ని ఏలుతోందని విమర్శించారు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ సమయంలో బైడెన్‌ ప్రభుత్వం అనుసరించిన తీరును కూడా ట్రంప్‌ తప్పుపట్టారు. 8,500 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక సైనిక పరికరాలను అఫ్గాన్‌లో వదిలేసి వచ్చామని, ఇప్పుడు వాటిని చైనా, రష్యా రివర్స్‌ ఇంజినీరింగ్‌ ద్వారా సొంతంగా తయారుచేసుకుంటాయన్నారు ట్రంప్‌.

Tags

Read MoreRead Less
Next Story