Donald Trump: వీసా ప్రాసెస్ ఇక మరింత సుళువు, ట్రంప్ తాజా ప్రకటన

Donald Trump:   వీసా ప్రాసెస్ ఇక మరింత సుళువు, ట్రంప్ తాజా ప్రకటన
X
అమెరికాకు రావాలని అనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలన్న ట్రంప్

భారతీయులకు అమెరికాకు ఎన్నికైన అధ్యక్షుడు ఎన్నికై డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్​ను సులభతరం చేస్తామని పేర్కొన్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి వెల్లగొడతానని తెలిపారు. చట్టబద్ధంగా తమ దేశానికి రావాలనుకునేవారి కోసం ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్​ను సింప్లిఫై చేస్తానని ట్రంప్ ప్రకటించడం వల్ల యూఎస్ వెళ్లాలనుకునే భారతీయులకు భారీ ఊరట కలగనుంది!

"వచ్చే నాలుగేళ్లలో అక్రమ వలసదారులను దేశం దాటిస్తాను. నియమనిబంధనలు, చట్ట ప్రకారమే అమెరికాకు రావాలి. అక్రమంగా కాదు. యూఎస్​కు వచ్చేందుకు 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు ఉన్నారు. వారందరూ అక్రమ వలసదారుల వల్ల అన్యాయానికి గురయ్యారు. అమెరికాకు రాబోయేవారు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలి. అమెరికా గురించి అవగాహన కలిగి ఉండాలి. అలాగే దేశాన్ని ప్రేమించాలి. నేరస్థులు అమెరికాకు వద్దు. గత మూడేళ్లలో అమెరికాకు 13,099 మంది నేరస్థులు వచ్చారు. దేశ నడివీధుల్లో వారు నడుస్తున్నారు. వారు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు దేశానికి వద్దు. మన దేశం నుంచి నేరస్థులను తరిమి కొట్టాలి." ఈ మేరకు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

డ్రీమర్‌ ఇమిగ్రెంట్స్‌ విషయంలో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తానన్నారు డొనాల్డ్ ట్రంప్. "వారి కోసం మనం ఏదైనా చేయాలి. ఎందుకంటే వారు చిన్న వయసులో అమెరికాకు వచ్చిన వ్యక్తులు. నేను డెమొక్రాట్‌లతో కలిసి ఒక ప్రణాళికతో పని చేస్తాను. రిపబ్లికన్లు డ్రీమర్ ఇమ్మిగ్రెంట్స్​కు అండగా ఉంటారు" అని ట్రంప్ తెలిపారు.

పొరుగు దేశాలు పొందుతున్న రాయితీలపై డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పందించారు. కెనడా, మెక్సికోకు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ రెండు అమెరికా రాష్ట్రాలైతే సరిపోతుందని వ్యాఖ్యానించారు. "కెనడాకు ఏటా 100 బిలియన్‌ డాలర్లు (రూ.8 లక్షల కోట్లు), మెక్సికోకు 300 బిలియన్‌ డాలర్ల (రూ.24లక్షల కోట్లు) సబ్సిడీ ఇస్తున్నాం. ఎందుకు ఆ దేశాలకు మనం రాయితీలు ఇవ్వాలి? దానికంటే ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనమైతేనే మంచిది." అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

Tags

Next Story