Trump- Putin: అవును! వాళ్ళిద్దరూ టచ్ లో ఉన్నారు

Trump- Putin: అవును! వాళ్ళిద్దరూ టచ్ లో ఉన్నారు
X
అమెరికాలో సంచలనం రేపుతున్న ట్రంప్- పుతిన్ రహస్య భేటీ..

మరికొన్ని వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.

మరికొన్ని రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ యూఎస్ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు సంబంధించిన ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్‌.. అత్యంత రహస్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కోవిడ్‌- 19 సమయంలో సీక్రెట్‌గా టెస్టు కిట్లు కూడా పంపించారని న్యూస్ ప్రచారం అవుతుంది. ఈ మేరకు యూఎస్‌కు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్‌ తాను రాసిన వుడ్‌వార్డ్ పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించారు.

కోవిడ్-19కు సంబంధించిన టెస్టు కిట్లు పంపిణి చేసిన విషయం బయటకు చెప్పొద్దని.. ఇది తన ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ట్రంప్‌ను కోరారు అని యూఎస్ కు చెందిన ప్రముఖ్య జర్నలిస్ట్ తాను రాసిన వుడ్‌వార్డ్ పుస్తకంలో ప్రస్తావించారు. దీంతో పుతిన్‌తో ట్రంప్‌కు ఉన్న రహస్య సంబంధాలపై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విషయాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, ట్రంప్‌-పుతిన్‌ మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలోనూ పలుమార్లు రష్యా అధినేతను ఈ రిపబ్లికన్‌ నేత బహిరంగంగానే ప్రశంసించారు. 2022లో ఉక్రెయిన్‌పై మాస్కో సైనిక చర్య తర్వాత పుతిన్‌ ఓ ‘జీనియస్‌’ అని అభివర్ణించారు. అంతేగాక, ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సాయంపైనా విమర్శలు గుప్పించారు. వాటిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించేస్తానని ఇటీవల ట్రంప్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Tags

Next Story