Donald Trump: మెక్‌డొనాల్డ్స్‌లో చెఫ్‌గా మారిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా అతను తన బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం తీసుకున్నాడు. దాంతో పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్స్‌లో ఆగాడు. ఈ సమయంలో అతను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి ప్రయత్నించాడు. “నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ పని చేయడం కూడా చాలా ఇష్టం” అని అన్నారు. అలాగే కమల హరీష్ కంటే 15 నిమిషాలు ఎక్కువ పనిచేశానని ట్రంప్ అన్నారు.రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ రెస్టారెంట్‌లో పనిచేశారు. పెన్సిల్వేనియాలోని మెక్డొనాల్డ్స్స్టోర్లో ఆదివారం కొద్దిసేపు పని చేశారు. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం ఇరు అభ్యర్థులూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా యుక్తవయసులో ఉన్నప్పుడు తాను ఓ మెక్‌డొనాల్డ్స్‌లో పని చేశానని డెమోక్రాటిక్పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్.. ఓ మెక్‌డొనాల్ట్స్ స్టోర్‌లో పనిచేసి ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.ఇద్దరు అభ్యర్థులు విజయాన్ని నిర్ధారించుకోవడానికి నవంబర్ 5 ఎన్నికలకు ముందు పెన్సిల్వేనియాలో తరచుగా సభలు ఇర్వహిస్తున్నారు. ట్రంప్, హారిస్ పెన్సిల్వేనియాపై వారి దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఇక్కడ వారి ఎన్నికల ప్రచారాన్ని బలోపేతం చేయడానికి ఇద్దరూ వందల మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో హారిస్, ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com