Donald Trump: మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు మార్గాలున్నాయ్ : డొనాల్డ్ ట్రంప్

అగ్ర రాజ్యం అమెరికాలో ఎవరైనా రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా పని చేసే అవకాశం ఉంటుంది. మూడోసారి చేసే అవకాశం ఉండదు. రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం.. ఏ వ్యక్తి కూడా రెండుసార్లు కంటే ఎక్కువ అధ్యక్ష పదవికి ఎన్నిక కాకూడదు. కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని తెలిపారు. అమెరికా ప్రజలు మరోసారి అధ్యక్షుడ్ని కావాలని కోరుకుంటున్నారని.. అంతేకాకుండా ప్రజలకు సేవ చేయడం తనకు కూడా చాలా ఇష్టమని చెప్పారు. మూడోసారి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని.. ఇది జోక్ కాదని పేర్కొన్నారు.
ప్రస్తుతం ట్రంప్ పదవీకాలం 2029లో ముగుస్తుంది. మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టే మార్గాలను అన్వేషిస్తున్నట్లు ట్రంప్ తేల్చిచెప్పారు. తమాషాగా మాత్రం చెప్పడం లేదని.. దీనికి మార్గాలు ఉన్నాయని చెప్పారు. అమెరికా ప్రజలు కోసం ఎంత కష్టమైనా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోడానికి ఏ మాత్రం వెనకాడనన్నారు. ఇదిలా ఉంటే మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఇంకా చాలా సమయం ఉందని.. దీని గురించి ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com