Donald Trump: ఈ నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం

అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ప్రమాణస్వీకారం చేస్తారు. యూఎస్ కాపిటల్ ఈ కార్యక్రమానికి వేదిక కానున్నది. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రెండు బైబిల్స్‌ను ఉపయోగించబోతున్నట్లు సమాచారం. ఇందులో ఓ బిబైల్‌ను ఆయనకు తల్లి బహుమతిగా ఇచ్చింది. ట్రంప్ 1955లో న్యూయార్క్‌లోని జమైకాలోని సండే చర్చిల్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంలో బైబిల్‌ను గిఫ్ట్ ఇచ్చారు.
ఇక రెండో బైబిల్ గురించి చెప్పాలంటే.. ఆ బైబిల్‌ను లింక్ లింకన్ బైబిల్‌గా పిలుస్తారు. అమెరికా తొలి అధ్యక్షుడు అబ్రహం లింకన్ 1861లో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం సమయంలో ఆ బిబైల్‌ను ఉపయోగించారు. అయితే, ఈ బిబైల్‌ను ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే ఉపయోగించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండుసార్లు అదే బైబిల్‌తో ప్రమాణస్వీకారం చేశారు. అలాగే, 2017లో డోనాల్డ్ ట్రంప్ మూడోసారి ఈ బైబిల్‌పై ప్రమాణ స్వీకారం చేశారు.
ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న జేడీ వాన్స్ సైతం ప్రమాణస్వీకారం సందర్భంగా తనకు తల్లి ఇచ్చిన బైబిల్‌ను ఉపయోగించనున్నారు. ఆయన అమ్మమ్మ బైబిల్‌ను తల్లికి ఇవ్వగా.. ఆ బైబిల్‌ను ఫ్యామిలీ బైబిల్‌గా పిలుస్తారు. ఇదిలా ఉండగా.. ట్రంప్ ఈ సారి భిన్నంగా ప్రమాణస్వీకారం వేదికగా మార్పు చేశారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత.. రోటుండాలో జరుగనున్నది. ఈ మేరకు కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం వాషింగ్టన్లో భారీగా చలి ఉన్నది. ఈ క్రమంలో రోటుండా సముదాయం లోపల వెచ్చటి వాతావరణంలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు.
వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్, జాతీయ చిహ్నాల ఎదుట.. వేలాది మంది మధ్య ప్రమాణస్వీకారం జరిగేది. ఈ సారి చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న వాషింగ్టన్లో దాదాపు మైనస్ 11 డిగ్రీలు ఉంటుందని అంచనా. ఈ క్రమంలో దాదాపు 1985 తర్వాత ప్రమాణస్వీకారోత్సవం రోటుండాలో నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు రోనాల్డ్ రీగన్ చలి కారణంగా రోటుండాలో ప్రమాణస్వీకారం చేశారు. రోనాల్డ్ రీగన్ తరహాలోనే తాను సైతం రోటుండాలో ప్రమాణ స్వీకార ప్రసంగం చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com